Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యకుమార్ యాదవ్‌కు ఆ నిక్ నేమ్ పెట్టింది ఎవరంటే..?

surya kumar yadav reveal why people calls him sky

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో వెలుగుచూసిన అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరిగా పేర్కొనవచ్చు. సూర్యకుమార్‌‌ను సహచరులు 'SKY' ( స్కై ) అనే నిక్ నేమ్‌తో పిలుస్తుంటారు. సూర్యకు స్కై అనే నిక్ నేమ్ ఎవరి ద్వారా, ఎలా వచ్చిందో తాజాగా బయటపెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 2012లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని దక్కించుకుంది.

కేకేఆర్‌కు ఆడుతున్నప్పుడే అతని బ్యాటింగ్ పదును క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. కోల్‌కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ అతని ప్రతిభను తొలినాళ్లలో గుర్తించిన వాళ్లలో ఒకడని చెప్పొచ్చు. అతని ప్రతిభపై, అతని క్రికెట్ స్కిల్స్‌పై గంభీర్ నమ్మకముంచి అతనికి అవకాశాలు ఇచ్చాడు. ఈ క్రమంలో కేకేఆర్‌లో ఉన్నప్పుడు గౌతీ భాయ్ తనను వెనుక నుంచి రెండు మూడు సార్లు 'స్కై' అని పిలిచాడని సూర్యకుమార్ గుర్తు చేసుకున్నాడు.

ఈ విషయమై యూట్యూబ్ షో బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్‌లో సూర్య మాట్లాడుతూ.. '2014లో కోల్ కతా టీంకు ఆడుతున్నప్పుడు ఓ సందర్భంలో గంభీర్ నన్ను వెనుక నుండి రెండు మూడు సార్లు 'SKY' అని పిలిచాడు. నేను అంతగా గమనించలేదు. అప్పుడు నన్ను పిలిచి నేను నిన్నే పిలుస్తున్నా. మీ పేరులో మొదటి ఇనిషియల్స్‌ను బట్టి అలా పిలుస్తున్నా అని చెప్పాడు. అప్పుడు నేను గ్రహించాను. అలా అప్పటి నుంచి నన్ను 'స్కై' అని అందరూ పిలవడం ప్రారంభమైందని' సూర్యకుమార్ షోలో తెలిపాడు.

surya kumar yadav reveal why people calls him sky

అలాగే ముంబైకి ఆడుతున్నప్పుడు.. ముంబై మెంటర్ సచిన్ టెండూల్కర్‌తో తనకు ఏర్పడ్డ తొలి పరిచయాన్ని సూర్య పంచుకున్నాడు. 'నేను మొదటిసారి ఎంఐ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లినప్పుడు అక్కడ కూర్చోవడానికి స్థలం లేదు. నేను నా కిట్ బ్యాగ్‌తో నిలబడ్డా. గణేష్ విగ్రహం పక్కనే కూర్చునే టెండూల్కర్ నన్ను పిలిచి తన పక్కన కూర్చోమని అడిగాడు.

అప్పటి నుంచి నేను సచిన్ పక్కన కూర్చునేవాణ్ని. స్వయంగా క్రికెట్ గాడ్ తన పక్కన కూర్చోమంటే ఇంకా అంతకన్న భాగ్యమేముంటుంది అందుకే అక్కడే కూర్చుంటా అని తెలిపాడు. ఇకపోతే ఐపీఎల్‌లో సూర్య 119మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 30.25సగటుతో మొత్తం 2541పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 82పరుగులు. మొత్తం 15 హాఫ్ సెంచరీలు చేశాడు.

Story first published: Tuesday, April 19, 2022, 17:28 [IST]
Other articles published on Apr 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+