Surya Kumar Yadav: అగ్రస్థానంలో సూర్య కుమారుడు.. భారత్ నుంచి కోహ్లీ తర్వాతే అతడే..

సూర్య కుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 బ్యాట్స్ మెన్లలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ బుధవారం (నవంబర్ 2) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సూర్య కుమార్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. 2022లో సూర్యకుమార్ యాదవ్ 26 ఇన్నింగ్స్‌లలో 42.50 సగటుతో ఒక సెంచరీ, ఎనిమిది అర్ధసెంచరీలతో 935 పరుగులు చేశాడు. పెర్త్‌లో నెదర్లాండ్స్‌పై 25 బంతుల్లో 51 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై 40 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
863 పాయింట్లు
ICC T20I బ్యాట్స్‌మెన్ తాజా ర్యాంకింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వాయ్‌లను వెనక్కి నెట్టిన సూర్య కుమార్ యాదవ్ 863 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. అంతే కాకుండా విరాట్ కోహ్లీ తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండో భారతీయుడు సూర్య కుమార్ నిలిచాడు. మహ్మద్ రిజ్వాన్ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. కాన్వే 792 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు.బ్యాట్స్ మెన్ల ర్యాకింగ్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లి 638 రేటింగ్ పాయింట్స్‌తో పదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. పాకిస్థాన్ పై 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ కింగ్ కోహ్లీ 44 బంతుల్లో ఒక సిక్స్, 8 ఫోర్లతో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications