For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదిరిందయ్యా సూర్యం.. గ్యారేజీలోకి కొత్త లగ్జరీ కారు, ధర టూ కాస్ట్‌లీ..!

Surya Kumar Yadav Bought A New Mercedes Benz Car with Cost Of 2.5Crores

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కొత్త కారు కొన్నాడు. అతను లగ్జరీ కారు అయిన Mercedes-Benz GLS AMG 63 కారును సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముంబైలోని ఆటో హ్యాంగర్ నుంచి ఈ లగ్జరీ కారును సేల్స్ ప్రతినిధులు డెలివరీ చేవారు. సూర్యకుమార్ యాదవ్ అతని భార్య దేవిషా శెట్టి ఈ కారు ముంగిట పలు ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను డీలర్‌ షిప్ ప్రతినిధులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మెర్సిడెస్ GLS AMG వేరియంట్ కారు బ్రాండ్లు ప్రస్తుతం భారతదేశంలో అమ్మకాలు జరగట్లేదు. అందువల్ల విదేశాల నుంచి మరీ తెప్పించి సూర్యకు ఈ కారును డీలర్స్ అందజేశారు. ఈ కారు ధర దాదాపు రూ.2.15కోట్లు ఉంటుంది.

వేరే లెవల్ ఏర్పాట్లతో..

వేరే లెవల్ ఏర్పాట్లతో..

ఇకపోతే కార్ డీలర్‌షిప్ షోరూమ్‌లో సూర్య కోసం వేరే లెవల్ ఏర్పాట్లు చేశారు. అతను సెంచరీ చేసినప్పుడు దిగిన పిక్.. అలాగే తన ట్రేడ్ మార్క్ సంబంధించిన స్టిల్స్ బొమ్మలను ఏర్పాటు చేసి.. బెలూన్లతో అలంకరించిన కొత్త కారును సూర్యకు డీలర్ షిప్ ప్రతినిధులు అందించారు. సూర్యకు కార్లంటే తెగ ఇష్టం. అతను ఇప్పటికే పోర్షే టర్బో 911 లాంటి సూపర్ కారును కలిగి ఉన్నాడు. ప్రస్తుతం అతను బెంజ్ మెర్సిడెస్ కారు ఓనర్ అయ్యాడు. కార్ వాలే ప్రకారం... ముంబైలో కన్వర్టిబుల్ సూపర్‌కార్ ధర ₹3.64 కోట్లు. యాదవ్ ఈ సంవత్సరం ప్రారంభంలో నిస్సాన్ జోంగా కారును కూడా కొనుగోలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా తరఫున సూర్యకుమార్ యాదవ్ విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ పర్యటనలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఆసియా కప్‌లో సూర్యకు చోటు

ఆసియా కప్‌లో సూర్యకు చోటు

ఇకపోతే ఆసియా కప్ 2022 టోర్నీలో ఆడ్డానికి సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. అతను ఓపెనర్‌గా బరిలో దిగుతాడా లేక మిడిలార్డర్లో బరిలోకి దిగుతాడా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఈ ఈవెంట్ ఆగస్ట్ 27నుండి యూఏఈలో జరగనుంది. భారత్ ఆగస్ట్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది. రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్సీ వహించబోతుండగా.. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

ఆసియా కప్ టోర్నీకి ఎంపికైన భారత జట్టు

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.

రిజర్వ్‌ ప్లేయర్లు : శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్.

Story first published: Friday, August 12, 2022, 20:22 [IST]
Other articles published on Aug 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+