For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలర్లకు చుక్కలు చూపించిన హషీమ్‌ ఆమ్లా.. 278 బంతుల్లో 37 రన్స్! పుజారాను తెరపైకి తెచ్చిన ఫాన్స్!!

Surrey vs Hampshire: Hashim Amla scores 37 off 278 balls in County Championship

లండన్: డిఫెన్స్‌కు పెట్టింది పేరు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. మైదానం ఏదైనా.. బౌలర్ ఎవరైనా ద్రవిడ్ బరిలోకి దిగాడంటే వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడాల్సిందే. అదే సమయంలో బౌలర్లు చుక్కలు చూడాల్సిందే. తన డిఫెన్స్‌తో టీమిండియాకు టెస్టుల్లో ఎన్నో పరాజయాలను తప్పించాడు. అందుకే అభిమానులు అతడిని ముద్దుగా ది వాల్, మిస్టర్ డిపెండబుల్ అని పిలుచుకుంటారు. టీ20 క్రికెట్ రావడంతో ద్రవిడ్‌లా డిఫెన్స్‌ ఆడే క్రికెటర్లు ప్రస్తుతం కరువయ్యారు. హషీమ్‌ ఆమ్లా, చేతేశ్వర్ పుజారా, డీన్ ఎల్గర్, బావుమా లాంటి వారే ఇప్పుడు డిఫెన్స్‌ ఆడుతున్నారు. అయితే తాజాగా ఆమ్లా తాజాగా ద్రవిడ్‌ను గుర్తుచేశాడు.

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా ఇంగ్లీష్ కౌంటీల్లో తన క్లాస్‌ ఆటతో ఆకట్టుకున్నాడు. డిఫెన్స్‌ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. సౌథాంప్టన్‌ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచులో ఆమ్లా సర్రే తరఫున బరిలోకి దిగాడు. చివరి రోజు 278 బంతులాడి 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో సర్రేను ఓటమి నుంచి కాపాడాడు.

మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్‌ కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది. హషీమ్‌ ఆమ్లా చేసిన 29 పరుగులే అత్యధికం. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ సర్రే కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన సర్రే మరో 3 పరుగులకే మూడో వికెట్‌ కోల్పోయింది. నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా సర్రే జట్టును తన క్లాస్ ఆటతో ఆదుకున్నాడు. ఆటలో ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డాడు. బౌన్సర్లు, యార్కర్లు వచ్చినా అడ్డుకుని క్రీజులో నిలిచాడు.

హషీమ్‌ ఆమ్లా తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులే చేశాడు. హాంప్‌షైర్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు వికెట్ చేజార్చుకోలేదు. ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టాడు. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా.. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే 122/8తో నిలిచింది. చివరకు మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దాంతో ఆమ్లా ఇన్నింగ్స్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. భారత బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా మాదిరిగా ఆమ్లా జట్టును రక్షించాడని ప్రశంసలు కురిపించారు.

Story first published: Thursday, July 8, 2021, 17:37 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+