83 చరిత్ర రిపీట్ అవుతుందా?: ఆశ్చర్యంగా! లార్డ్స్‌లో మ్యాచ్ ఆడని కోహ్లీసేన!

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌కు వేల్స్ అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 11 వేదికలు ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో అర్ధభాగంలో మ్యాచ్‌లు నిర్వహించారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మే30న ఈ ప్రపంచకప్ ప్రారంభంకాగా నెల రోజుల తర్వాత అంటే జూన్ 23న లార్డ్స్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ ప్రపంచకప్ లీగ్ స్టేజిలో కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. లార్డ్స్‌లో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లు(దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్) ఆడగా... ఆస్ట్రేలియా(ఇంగ్లాండ్, న్యూజిలాండ్) కూడా రెండు మ్యాచ్‌లు ఆడింది.
అయితే ఇండియా, వెస్టిండిస్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లకు ఈ ఐకానిక్ వేదికలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని ఐసీసీ కల్పించలేదు. ఈ ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా ఉన్న టీమిండియాకు సైతం లార్డ్స్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

కోహ్లీసేన సెమీస్‌లో గెలిస్తే
అయితే, ఈ ప్రపంచకప్‌లో కోహ్లీసేన సెమీస్‌లో గెలిస్తే పైనల్లో లార్డ్స్‌లో ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లను జులై 9, జులై 11న నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోహ్లీసేన రెండో స్థానంలో ఉంది.

లార్డ్స్ వేదికగా జులై 14న పైనల్
లీగ్ స్టేజిలో శనివారం శ్రీలంకతో జరగనున్న తన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా టీమిండియాకు వచ్చిన ఇబ్బంది లేదు. సెమీ పైనల్లో తాను తలపడబోయే జట్టుపై టీమిండియా గెలిస్తే లార్డ్స్ వేదికగా జులై 14న జరిగే పైనల్లో టీమిండియా ఆడుతుంది.

లార్డ్స్‌లో రెండు సార్లు మాత్రమే
నిజానికి ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో లార్డ్స్ వేదికగా టీమిండియా మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు తక్కువే. అయితే, ఆడి రెండు సందర్భాల్లో టీమిండియా చరిత్రను సృష్టించడం విశేషం. లార్డ్స్ వేదికగా జూన్ 7, 1975లో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడింది. ప్రపంచకప్‌లో జరిగిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీనివాస్ వెంకట్రాఘవన్ నేతృత్వంలోని టీమిండియా 202 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ 174 బంతులు ఆడిన సునీల్ గవాస్కర్ 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

జూన్ 25, 1983లో లార్డ్స్‌లో చరిత్ర
ఇక, జూన్ 25, 1983లో టీమిండియా రెండోసారి లార్డ్స్‌లో మ్యాచ్ ఆడింది. కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించింది. కపిల్ డెవిల్స్‌గా పేరుగాంచిన ఈ రోజున వెస్టిండిస్‌పై 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈరోజు అంతలా చరిత్రలో నిలిచిపోయింది.

ఇప్పుడు కోహ్లీసేన వంతు
ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన 1979, 1999 వరల్డ్ కప్‌ల్లో కూడా టీమిండియా లార్డ్స్ వేదికగా మ్యాచ్ ఆడలేదు. అయితే, ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతు వచ్చింది. సెమీ పైనల్లో గెలిచి ఫైనల్లోకి అడుగు పెడితే గనుక లార్డ్స్ మ్యాజిక్‌ను కోహ్లీసేన మళ్లీ రిపీట్ చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications