For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లి-రోహిత్ కాదు.. ఆ కుర్రాడితోనే మాకు డేంజర్- లైయన్

మరో నెల రోజుల్లో టీమిండియా టెస్టు ఫార్మాట్‌ సందడి మొదలుకానుంది. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు, అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు భారత్ ఆడనుంది. అనంతరం ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా అయిదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే భారత్‌కు ఈ సిరీస్‌ల్లో విజయం తప్పనిసరి.

కంగారూల గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్ ఈ సారి కూడా ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. అయితే భారత్‌తో జరిగే ఈ టెస్టు సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ తమకు కొరకరాని కొయ్యగా మారుతాడని ఆస్ట్రేలియా ప్రధాన సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జైస్వాల్ సంచలన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

Surprising Contender Nathan Lyon Picks Unexpected Indian Batter as Australia s Biggest Challenge in Border-Gavaskar Trophy

అయిదు మ్యాచ్‌ల్లో 712 పరుగులు సాధించాడు. సెంచరీలు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ నేపథ్యంలో జైస్వాల్‌‌తోనే తమకు ప్రమాదకరమని లైయన్ అన్నాడు. అంతేగాక జైస్వాల్‌ జోరు‌కు కళ్లెం వేయడానికి ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హర్ట్‌లీతో కూడా మాట్లాడానని తెలిపాడు. ''జైస్వాల్‌తో ఇప్పటివరకు తలపడలేదు. కానీ, మాలాంటి బౌలర్లందరికీ ఆ కుర్రాడు పెద్ద సవాల్‌. ఇంగ్లాండ్‌పై అతను ఆడిన విధానాన్ని చాలా దగ్గరగా గమనించాను. అతను అద్భుతంగా ఆడాడు. జైస్వాల్ గురించి టామ్ హార్ట్‌లీతో మాట్లాడాను. భిన్న బౌలర్లను విభిన్నమైన శైలిలో ఆడటం ఆసక్తికరంగా అనిపించింది''

Surprising Contender Nathan Lyon Picks Unexpected Indian Batter as Australia s Biggest Challenge in Border-Gavaskar Trophy

నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.

Story first published: Monday, August 19, 2024, 9:25 [IST]
Other articles published on Aug 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+