For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గ్రేట్ ప్లేయర్: సచిన్‌ని కాదని 'గిల్లీ'కి పట్టం కట్టిన స్టీవ్ వా

By Nageshwara Rao

హైదరాబాద్: 21వ శతాబ్ధపు గ్రేటెస్ట్ ప్లేయర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఎంపిక చేశాడు. అయితే ఈ ఎంపిక ఎంతో మందిని ఆశ్చర్య పరిచింది. స్టీవ్ వా కెప్టెన్సీలో ఆడిన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 2000 నుంచి టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్నారు.

ఒకానొక సందర్భంలో గిల్‌క్రిస్ట్ లాంటి ఎడమ చేతివాటం కీపర్ దొరకడం తమ అదృష్టమని స్టీవ్ వా గొప్పగా కొనియాడారు. 44 ఏళ్ల గిల్‌క్రిస్ట్ ఆస్ట్రేలియా తరుపున 96 టెస్టులాడాడు. 47.60 యావరేజితో 5,570 పరుగులు సాధించాడు.

ఇక 81.95 స్ట్రయిక్ రేటుతో 17 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిల్‌క్రిస్ట్ అభిమానులు ఆయన్ను ఎటాకింగ్ బ్యాట్స్‌మెన్ అంటూ కొనియాడుతుంటారు. 1999లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన గిల్‌క్రిస్ట్, 2008లో వీడ్కోలు పలికాడు.

Surprise! Steve Waugh picks Adam Gilchrist as the greatest player of 21st century

21వ శతాబ్దపు గ్రేటెస్ట్ క్రికెటర్‌గా మాజీ ఆటగాళ్లు అయిన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్, ముత్తయ్య మురళీ ధరన్‌లలో ఎవరినో ఒకరిన స్టీవ్ వా ఎంపిక చేస్తాడనుకుంటే 'గిల్లీ'ని ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో స్టీవ్ వా తన బ్యాటింగ్‌తో ఆట స్వరూపాన్నే మార్చగల సత్తా ఉన్న ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంటూ ప్రశంసలు కురిపించాడు. అతనికి కెప్టెన్‌గా ఉండటం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా తరుపున స్టీవ్ వా 168 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+