ఆకతాయిలకు సురేశ్ రైనా హెచ్చరిక.. ఎందుకో తెలుసా!!

ముంబై: దేశంలో మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 128 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతువాత పడ్డారు. దీంతో దేశంలోని సెలెబ్రిటీలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ సూచించారు. తాజాగా సీనియర్ బ్యాట్స్‌మన్, టీ20 స్పెషలిస్ట్ సురేశ్ రైనా కూడా కరోనాపై స్పందించాడు. ఆకతాయిలు కరోనాపై తప్పుడు సమాచారాన్ని ఇతరులకు చేరవేయొద్దని హెచ్చరించాడు.

తప్పుడు సమాచారాన్ని షేర్ చేయొద్దు
సురేశ్ రైనా తాజాగా మాస్క్ ధరించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేసి ప్రజలకు పలు సూచనలు చేసాడు. 'ప్రమాదకర కరోనా వైరస్‌ను నివారించడానికి సామాజిక బాధ్యతగా స్వీయ నిర్బంధంలో ఉండే అవసరాన్ని మనమంతా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని మరొకరికి పంపకండి. వైద్యాధికారుల సూచనలు తప్పక పాటించండి. వాటిపై అశ్రద్ధ వహించొద్దు. స్వచ్ఛందంగా పరిశుభ్రతను పాటించండి' అని విజ్ఞప్తి చేశాడు.
ప్రాక్టీస్ సెషన్ రద్దు:
కొరోనా మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13 ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. దీంతో అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను పక్కనపెట్టి ఇంటికి పయమయ్యారు. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రాక్టీస్ సెషన్‌కు శనివారం ముగింపు పలికింది. దీంతో ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా అంబటి రాయుడు, సురేశ్ రైనా మరికొందరు ఆటగాళ్లు శనివారం చెన్నైను వీడి తమ ఇళ్లకు చేరుకున్నారు.

సోనాలి బింద్రేతో డేట్‌కి వెళ్లాలనుండే:
సురేష్ రైనా ఏ బాలీవుడ్ నటితోనూ ప్రేమాయణం నడపలేదు. అలాంటి వార్తలు కూడా బయటకు రాలేదు. అయితే తనకు కూడా ఓ బాలీవుడ్ సీనియర్ నటిపై క్రష్ ఉండేదట. ఆ హీరోయినే సోనాలి బింద్రే. సోనాలి అంటే తనకు క్రష్ అని 'జింగ్ గేమ్ ఆన్' ఎపిసోడ్‌లో గతంలో రైనా తెలిపాడు. 'నా కాలేజీ రోజుల్లో సోనాలి బింద్రే అంటే క్రష్ ఉండేది. ఆమెతో డేట్‌కి వెళ్లాలనుండే. ఈ విషయం ఎవరికీ తెలియదు' అని రైనా చెప్పుకొచ్చాడు. కోరిక నెరవేరలేకపోయినా.. ఓ సారి మాత్రం సోనాలి నుంచి స్పెషల్ మెసేజ్ వచ్చిందని చెప్పాడు.

18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌లో తరచుగా మ్యాచ్‌లు ఆడుతున్న రైనా.. ఐపీఎల్-12 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. ఆపై గాయం కారణంగా ఆటకు చాలా నెలలు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications