

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా మంగళవారం 32వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. రైనా పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
రంజీల్లో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సురేశ్ రైనా ఈ ఏడాది జులైలో చివరిసారిగా భారత జాతీయ జట్టు తరుపున ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ వన్డే సిరిస్‌లో టీమిండియా 1-2తేడాతో ఓటమిపాలైంది. ఐపీఎల్‌లో రైనా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
సురేశ్ రైనాను చెన్నై అభిమానులు ముద్దుగా "చిన్న తలా" అని పిలుచుకుంటుంటారు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా పుట్టినరోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేకంగా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. భారత్ తరుపున 226 వన్డేలాడిన 5615 పరుగులు చేశాడు.
మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన సురేశ్ రైనా 2006లో టీ20లో అరంగేట్రం చేయడం అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం అయ్యారు. భారత్ తరుపున మొత్తం 78 టీ20ల్లో 134.87 యావరేజితో సురేశ్ రైనా 1605 పరుగులు చేశాడు. ఇక, భారత్ తరుపున రైనా 18 టెస్టు మ్యాచ్‌లాడాడు.
ట్విట్టర్‌లో సురేశ్ రైనాకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ