Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లంక ప్రీమియర్ లీగ్‌లో ఐపీఎల్ లెజెండ్.. వేలంలో పేరు నమోదు చేసుకున్న రైనా!

టీమిండియా మాజీ ప్లేయర్, ఐపీఎల్ లెజెండ్ సురేష్ రైనా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జరిగే లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) వేలంలో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. కనీస ధర 50 వేల డాలర్ల ధరతో అతను ఈ వేలం బరిలో దిగుతున్నట్లు సమాచారం. శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఈ వేలంలో పాల్గొనే అంతర్జాతీయ, దేశీయ ఆటగాళ్ల జాబితాను తాజాగా విడుదల చేసింది.

ఈ జాబితాలో రైనా పేరు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లంక ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా లెజెండరీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఆడాడు. అయితే ఈ ఏడాది తొలిసారి తాము కూడా ప్లేయర్ల వేలం నిర్వహించాలని లంక బోర్డు నిర్ణయించింది. ఈ వేలంలో రైనా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో చెలరేగిన రైనా ఈ లీగ్‌లో కూడా అద్భుతంగా ఆడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Suresh Raina to go under hammer in LPL player auction

టీమిండియా తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన రైనా.. వన్డే, టెస్టు, టీ20 మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు కూడా సృష్టించాడు. అంతేకాదు, 2011 వన్డే వరల్డ్ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. అలాగే 2013లో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు చివరగా నెగ్గిన ఐసీసీ ట్రోఫీ ఇదే కావడం గమనార్హం.

ఈ సమయంలో ఐపీఎల్‌లో కూడా రైనా అద్భుతంగా రాణించాడు. ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ధోనీ సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతను.. ఆ టీం మిడిలార్డర్‌కు వెన్నెముకలా మారాడు. చెన్నై నాలుగుసార్లు టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. ధోనీతోపాటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను.. గతేడాది సెప్టెంబరులో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. చివరగా లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడిన రైనా ఫర్వాలేదనిపించాడు.

Story first published: Tuesday, June 13, 2023, 9:00 [IST]
Other articles published on Jun 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+