న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెమెరా కంటికి దూరమై.. రైనా చేతిలో చిక్కింది

Suresh Raina takes a stunning catch to dismiss

హైదరాబాద్: ఇరు జట్లు సమంగా కొనసాగుతున్న ట్రోఫీలో కేవలం ఒక్క మ్యాచ్ దిశను మార్చేస్తుంది.. అనుకున్న తరుణంలో ఎవరికైనా ఉత్కంఠ నెలకొంటుంది. అదే ఉద్విగ్న పరిస్థితుల మధ్య జరిగింది సోమవారం మ్యాచ్. నిదహాస్ ట్రోఫీలో భాగంగా భారత్, శ్రీలంక జట్లు లంక వేదికగా తలపడ్డాయి.

టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న లంక జట్టు భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండున్నరేళ్ల నిరీక్షణను దాటి వచ్చిన సురేశ్ రైనా ఫీల్డింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు దూకుడుగా ఆడి రెండు ఓవర్లు ముగిసే సమయానికి 25/0తో నిలిచింది. ఈ దశలో మూడో ఓవర్ వేసేందుకు శార్ధూల్ ఠాకూర్ సిద్ధమయ్యాడు. అతని బౌలింగ్‌లో తొలి బంతినే మిడ్‌వికెట్ దిశగా బౌండరీకి తరలించేందుకు వేగవంతమైన షాట్ ఆడాడు గుణతిలక (17) .

గుణతిలక షాట్ కొట్టిన వేగానికి మైదానంలోని కెమెరా‌మెన్ కూడా బంతి రైనా తలమీదుగా వెనక్కి వెళ్లిపోయిందని.. తొలుత భ్రమించి.. తర్వాత మళ్లీ కెమెరాని వెనక్కి తిప్పాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సురేశ్ రైనా పక్కకి దూకుతూ అద్భుతంగా బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. తాజాగా వారి అంచనానే నిజమైంది. అత్యంత కష్టసాధ్యమైన మ్యాచ్‌ని రైనా.. అద్భుతంగా ఒడిసిపట్టిన వైనం.. అభిమానుల్ని అమితంగా ఆకర్షిస్తోంది.

కెరీర్ ఆరంభం నుంచి ఫీల్డింగ్‌లో తనదైన మార్క్‌ చూపుతున్న రైనా.. ఈ టోర్నీలోనే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగెత్తుతూ ముందుకు వచ్చి ఓ క్యాచ్‌ని జారవిడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే.. వేగంగా పరుగెత్తుకుంటూ రావడం, మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంటో ఆ క్యాచ్ చేజారుంటుంది తప్ప.. రైనా ఫీల్డింగ్‌లో పొరపాటు చేయడని మ్యాచ్ కామెంటేటర్లు సైతం ఆ మ్యాచ్‌లో చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, March 13, 2018, 16:50 [IST]
Other articles published on Mar 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X