గ్రౌండ్లో ప్రాక్టీస్ మొదలెట్టిన సురేష్ రైనా..! పునరాగమనం కోసమేనా? నెట్టింట్లో అభిమానుల సంతోషం..

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. 35ఏళ్ల రైనా ఇప్పటికే 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో సహా అన్ని రకాల క్రికెట్‌కు ఇంకా వీడ్కోలు చెప్పలేదు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున చివరిసారిగా రైనా ఆడాడు. ఆ తర్వాత 2022 మెగా వేలంలో రైనాను ఎవరూ కొనుక్కోలేదు.
దీంతో ఈ మెగావేలంలో అన్ సోల్డ్ అయిన మిస్టర్ ఐపీఎల్ ఇక అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్తాడనుకునే టైంలో అతను మళ్లీ బ్యాట్ అందుకున్నాడు. మొన్నటివరకు కామెంటేటర్‌గా వ్యవహరించిన రైనా గ్రౌండ్లో ప్రాక్టీస్ కోసం బరిలోకి దిగాడు. తన సోషల్ మీడియా వేదికంగా కొంతమంది ప్లేయర్లతో కలిసి మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అతను పోస్ట్ చేశాడు. ఇక రైనా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది.
చెన్నైకి శాస్తి జరిగింది
రైనాకు డై హార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారనే సంగతి తెలిసిందే. అతను ఐపీఎల్లో కూడా కన్పించకపోయేసరికి చాలా మంది అభిమానులు ఈసారి తీవ్ర నిరాశ చెందారు. కొందరైతే చెన్నైకి శాస్తి జరిగింది అంటూ ఆ జట్టు అట్టడుగు నుంచి రెండో ప్రదర్శనపై కామెంట్లు చేశారు. రైనా ఉన్న ప్రతిసారి ఆ జట్టు ప్లేఆఫ్ చేరుకుంది. కానీ 2020లో, 2022లో రైనా ఆ జట్టుకు దూరం కావడంతో ఈ రెండు సార్లు జట్టు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. చెన్నైకి లాయల్ ప్లేయర్ అయిన రైనాను ఆ జట్టు ఎందుకు విశ్వసించలేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు.
ఇటీవల రవీంద్రా జడేజా సైతం
అలాగే ఇటీవల రవీంద్ర జడేజా సైతం చెన్నై సూపర్ కింగ్స్‌కు అంటీ ముట్టనట్లు ఉంటూ ఇక సీఎస్కేకు గుడ్ బై చెప్పేస్తాననేటట్లు ప్రవర్తిస్తున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలో సీఎస్కేకు సంబంధించిన పోస్టులు డిలీట్ చేయడం అలాగే తాను పెట్టిన క్యాప్షన్లను ఎరేజ్ చేయడం వంటివి చేస్తున్నాడు. దీంతో వచ్చే సీజన్లో రవీంద్రా జడేజా కూడా చెన్నైకి గుడ్ బై చెప్పే అవకాశముంది.
అయితే చెన్నైకి గుడ్ బై చెప్పాక మరో జట్టు రవీంద్రా జడేజాను కొనుక్కుంటుందా అనేది మళ్లీ డౌటే. రైనా విషయంలో జరిగినట్లే అతని విషయంలోనూ జరిగే అవకాశాలు లేకపోలేదు. ఏం జరుగుతుందో మరీ.. సీఎస్కే అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ధోనీ, రైనా, జడేజా.. ఈ ముగ్గురిలో రైనా ఇప్పటికే వైదొలగగా, జడేజా వైదొలగడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక 40ఏళ్ల ధోనీ సైతం వచ్చే సీజన్ తర్వాత దాదాపు వీడ్కోలు చెప్పక తప్పదు. దీంతో తర్వాత చెన్నైని నడిపించేది ఎవరో మరీ.
నెటిజన్ల కామెంట్ల వెల్లువ
ఇక చెన్నై వచ్చే సీజన్లో రైనాను తీసుకుంటే మాత్రం ఫ్యాన్స్ నుంచి భీకర సపోర్ట్ లభించడం ఖాయం. ఎందుకంటే రైనా పునరాగమనం కోసం అతని అభిమానులను ఎంతో ఆత్రుతగా వేచిచూస్తున్నారు. ఆటకు దూరమై రెండేళ్లు అయినా రైనా క్రేజు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇక తాజాగా రైనా పోస్టు చేసిన వీడియోనే ఇందుకు నిదర్శనం. ఈ వీడియోపై నెటిజన్లు సైతం కమ్ బ్యాక్ లోడింగ్, మాన్ స్టర్ ఈజ్ బ్యాక్, చిన్న తాలా ఆన్ ది వే ఇలా డిఫెరెంట్ కామెంట్లు పెడుతున్నారు. అయితే రైనా ఈ ప్రాక్టీస్ ఎందుకోసం చేస్తున్నాడనేది మాత్రం ఇప్పటికీ అంతు బట్టట్లేదు. ఈ విషయం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

రికార్డులే రికార్డులు
ఇకపోతే 2011 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో రైనా సభ్యుడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడు. అతను టీ20 కెరీర్‌లో 6000, 8000పరుగులు చేసిన మొదటి భారతీయ ఆటగాడు. ఐపీఎల్లో 5,000 పరుగులకు చేరుకున్న మొట్టమొదటి క్రికెటర్. ఛాంపియన్స్ లీగ్ టీ20 చరిత్రలో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు అతనిదే. ఇలా రైనా పేరిట చాలా రికార్డులే ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications