మూడు టీ20ల సిరిస్ కోసం సఫారీ పర్యటనకు సురేశ్ రైనా

హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి సురేశ్ రైనా పునరాగమనం చేయనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన తుది జట్టులో సురేశ్ రైనా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా ఆదివారం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లనున్నాడు.
భారత తరుపున చివరిసారిగా రైనా ఫిబ్రవరి 1, 2017న ఇంగ్లాండ్‌తో జరిగిన ఆడాడు. ఆ తర్వాత రైనాను ఫిట్‌నెస్ సమస్యలు వేధించడంతో పాటు జట్టులో ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యో-యో టెస్టు పాసవ్వకపోవడంతో ఏడాదిపాటు జట్టుకు దూరమయ్యాడు.
గతేడాది చివర్లో యో-యో టెస్టు పాసైన రైనా దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ20ల సిరిస్‌లో భారత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆరు వన్డేల సిరిస్ అనంతరం ఫిబ్రవరి 18 నుంచి భారత్-దక్షిణాప్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా ఆదివారం దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications