For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరిసిన రైనా: ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత యుపి

ముంబై: ప్రతిష్ఠాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను సురేష్ రైనా సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ జట్టు కైవసం చేసుకుంది. బుధవారం వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు బరోడాను 38 పరుగుల తేడాతో ఓడించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన బరోడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన యుపి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కో ల్పోయ 163 పరుగులు చేసింది. ప్రశాంత్ గుప్తా 49 పరుగులు సాధించగా, సురేష్ రైనా అజేయం గా 47 పరుగులు చేశాడు. బరోడా బౌలర్లలో భా ర్గవ్ భట్ 13 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు. ఇర్ఫాన్ పఠాన్ 44 పరుగులకు ఒకటి, ఆస్ట్రేలియా లో టి-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపి కైన హార్దిక్ పాండ్య 31 పరుగులకు ఒకటి చొప్పు న వికెట్లు పడగొట్టారు.

Suresh Raina shines as Uttar Pradesh win Syed Mushtaq Ali Trophy

అనంతరం 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన బరోడా 26 పరుగుల వద్ద కేదార్ దేవధర్ (19) అ వుటయ్యాడు. మరో ఓపెనర్ మృణాల్ దేవధర్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుట్‌కావడంతో కష్టాల్లో పడిన బరోడా కోలుకోలేకపోయంది.

జట్టును గెలిపించే సత్తావున్న హార్దిక్ పాండ్య (13), దీపక్ హుడా (15) తక్కువ స్కోర్లకే వెనుదిరగడం తో బరోడా ఆశలు నీరుగారిపోయాయ. భారీ షా ట్లతో బౌలర్లపై విరుచుకుపడే యూసుఫ్ పఠాన్ కూడా బాధ్యతాయుతంగా ఆడలేకపోయాడు. అతను 14 పరుగులకే పెవిలియన్ చేరగా, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు.

షోయబ్ తాయ్ (26 నాటౌట్) చివరి వ రకూ పోరాటాన్ని కొనసాగించినా ఫలితం లేకపోయింది. బరోడా ఆలౌట్ కాకపోయనా, రన్‌రేట్‌ను అందుకోలేక, 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి ఓటమిపాలైంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+