ఎప్పటికీ భారత అత్యత్తమ కెప్టెన్ ధోనినే.. మహీపై రైనా ప్రశంసల జల్లు

MS Dhoni Is The Best Captain India Ever Had - Suresh Raina || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎప్పటికీ భారత అత్యుత్తమ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనినేనని వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తెలిపాడు. భారత్‌ జట్టును విజయవంతంగా నడిపించినా, ఐపీఎల్‌లో చెన్నైను ఉన్నత స్థానంలో నిలిపినా అది ధోనికే సాధ్యమన్నాడు. స్టార్ స్పోర్ట్స్ తమిళంలో ప్రసారమైన'ది సూపర్ కింగ్స్ షో 'లో రైనా తమ కెప్టెన్ మహీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

అందుకే బుమ్రా విఫలమయ్యాడు: జహీర్ ఖాన్

ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మరింతో జోష్‌తో బరిలోకి దిగుతున్నామని ఈ స్టార్ బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. 'ఈ ఏడాది మా జట్టులో చాలా మంది కొత్తవారున్నారు. తమిళనాడు బౌలర్‌ సాయి కిషోర్‌, హజల్‌వుడ్‌, కరాన్‌, పియూష్‌ చావ్లా అంతా కొత్తావారే. వీరంతా మంచి నైపుణ్యం కలిగిన ప్లేయర్లు. వారిలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అటు సీనియర్లు, ఇటు యువ క్రికెటర్లతో మా జట్టు నిండి ఉంది. దాంతో మాకు మరింత మంది అభిమానుల మద్దతు లభిస్తుంది. మేము కూడా ఫ్యాన్స్‌ ఇచ్చే ఉత్సాహంతో మరింత ఎనర్జీగా ఐపీఎల్‌లో అలరిస్తాం. అన్ని రకాల క్రికెటర్లు మా జట్టులో ఉన్నారు' అని రైనా తెలిపాడు. ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్‌-2020 జరుగనుంది.

ఇక గతేడాది వన్డే సెమీస్ అనంతరం ఆటకు దూరమైన ధోనీ ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌తో మహీ భవితవ్యం తేలనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, February 13, 2020, 19:34 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X