Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అస్ట్రేలియా ఉత్తదే, మూడు జట్ల మధ్యే పోటీ ఉంటుంది: సురేష్ రైనా

Suresh Raina
బెంగళూరు: ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడినట్లేనని, ఈసారి భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక మధ్యే పోటీ ఉంటుందని టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. టైటిల్‌ కోసం ప్రధాన పోటీ ఉపఖండ జట్లు భారత్‌, పాక్‌, లంక మధ్యే ఉంటుందని, ఇంగ్లాండ్‌ కూడా రేసులో ఉందని ఆయన అన్నారు. ఆసీస్‌తో పోల్చుకుంటే మిగతా జట్లు మెరుగయ్యాయని, టోర్నీలో శుభారంభం కీలకంమని రైనా అన్నాడు. సెమీస్‌ చేరిందంటే భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టినట్లేనని చెప్పాడు.

సెమీస్‌ చేరడమే మా తొలి లక్ష్యమని, తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించడం కష్టమేం కాదని అతను అన్నాడు. అత్యుత్తమ జట్టు బరిలోకి దిగుతోందని చెప్పాడు. ప్రపంచకప్‌లో ఆడాలన్న కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని రైనా చెప్పాడు. ''2007 ప్రపంచకప్‌కు ఎంపిక కాలేకపోయా. నిరాశ చెందా. ప్రపంచకప్‌ కల ఈసారి నిజమవనుంది. సొంత అభిమానుల ముందు ఆడుతుండడం వల్ల ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే ఒత్తిడిలో ఆడడాన్ని అలవాటు చేసుకున్నాం. సచిన్‌, సెహ్వాగ్‌, ధోనీ లాంటి క్రికెటర్లు ఉండడం వల్ల ఒత్తిడి ఉన్నట్లు ఎప్పుడూ అనిపించదు'' అని వివరించాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+