విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతివ్వాలి: రైనా

ఢిల్లీ: సీనియర్ ఆటగాళ్లకు విదేశీ లీగ్‌లు ఆడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతివ్వాలని టీమిండియా వెటరన్ ఆటగాళ్లు సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. మన ఆటగాళ్లకు ఐపీఎల్ తప్ప విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్న నేపథ్యంలో వీరు ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ క్రికెటర్లు ఫారెన్ టీ20ల్లో ఆడటం ద్వారా తమ స్కిల్స్‌ని మరింత మెరుగుపర్చుకుంటున్నారని రైనా అన్నాడు.

బీసీసీఐ పునరాలోచించుకోవాలి:
శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా సురేష్ రైనా మాట్లాడుతూ... 'విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతివ్వాలి. చాలా దేశాలకు చెందిన ఆటగాళ్లు లీగ్‌ల్లో పాల్గొనడం ద్వారా తమ ఫామ్ చాటుకుంటున్నారు. అలాంటప్పడు ఫ్రాంచైజీ క్రికెట్‌కు అనుమతివ్వడమే మంచిది. విదేశీ టీ20 లీగ్స్‌లో భారత క్రికెటర్లని అనుమతించడంపై బీసీసీఐ పునరాలోచించుకోవాలి' అని సూచించాడు. ఈ ప్రతిపాదనకు ఇర్ఫాన్ పఠాన్ మద్దతు తెలిపాడు.

లీగ్స్‌లో ఆడేందుకు పర్మీషన్ ఇవ్వాలి:
30 ఏళ్లు పైబడి భారత్ జట్టులో చోటు కోల్పోయిన భారత క్రికెటర్లని విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు పర్మీషన్ ఇవ్వాలి అని పఠాన్ అన్నాడు. 'క్రికెటర్లు అరంగేట్రం చేసే వయసు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆసీస్ విషయానికి వస్తే..29 ఏళ్ల వయసులో మైక్ హస్సీ తొలి మ్యాచ్ ఆడాడు. అదే భారత్‌లో అయితే 30 ఏళ్లకు దగ్గరపడ్డాడంటే.. అతడిని జాతీయ జట్టు ఎంపిక కోసం దాదాపుగా పరిగణించారు. అలాంటప్పుడు 30 పైబడి జాతీయ జట్టు అంచనాల పరిధిలో లేని ఆటగాళ్లనైనా విదేశీ లీగ్‌లు ఆడేందుకు అనుమతించాలి' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

పీఎల్ తరహాలో ఏ లీగ్ క్లిక్ కాలేదు:
భారత్ గడ్డపై 2008లో ఫ్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ హిట్ కావడంతో.. చాలా క్రికెట్ దేశాలు టీ20 లీగ్స్‌ను ప్రారంభించాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కొద్దిగా ఫేమస్ అయినా.. ఐపీఎల్ తరహాలో మాత్రం క్లిక్ కాలేదు. ఆయా దేశాల లీగ్‌లు క్లిక్ కాకపోవడానికి కారణం భారత క్రికెటర్లు పాల్గొనకపోవడమేననేది బహిరంగ రహస్యం. కానీ ఐపీఎల్‌లో మాత్రం పాకిస్థాన్ మినహా అన్ని దేశాల క్రికెటర్లు ఆడుతున్నారు.

ఐపీఎల్‌కి ఆదరణ తగ్గుతుందని:
భారత క్రికెటర్లని విదేశీ టీ20 లీగ్‌లలో ఆడిస్తే.. ఐపీఎల్‌కి ఆదరణ తగ్గుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంగానే మొదటి నుంచి కఠినమైన ఆంక్షల్ని పెట్టింది. ఏ భారత క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించకుండా.. విదేశీ టీ20 లీగ్‌లలో ఆడటానికి వీలులేదు. ఒకవేళ ఎవరైనా ఆడాలనుకున్నా.. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలి. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాతే టీ10 లీగ్ ఆడిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications