Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడు సెహ్వాగ్, సచిన్‌, యువీ తరహా క్రికెటర్‌: రైనా

Suresh Raina sasys Rishabh Pant as dominant as Virender Sehwag, Yuvraj Singh
Rishabh Pant as Dominant as Sehwag, Yuvraj And Reminds Rahul Dravid: Suresh Raina

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌పై వెటరన్‌ క్రికెటర్‌, టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ సురేశ్‌ రైనా ప్రశంసలు కురిపించాడు. పంత్‌ ఒక అసాధారణ క్రికెటర్‌ అంటూ కొనియాడాడు. భారత క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ లాగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడన్నాడు. టీమిండియా స్సిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో పాల్గొన్న రైనా.. పైవిధంగా పేర్కొన్నాడు.

 సచిన్, సెహ్వాగ్, యువీ‌ల తరహా క్రికెటర్‌:

సచిన్, సెహ్వాగ్, యువీ‌ల తరహా క్రికెటర్‌:

చహల్, రైనా మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌ సందర్భంగా రిషభ్‌ పంత్ ప్రస్తావన వచ్చింది. రైనా మాట్లాడుతూ... 'నా దృష్టిలో రిషబ్ పంత్ ఒక టాప్‌ క్రికెటర్‌. చాలా స్టాంగ్ ఆటగాడు కూడా. అసాధారణ బ్యాటింగ్‌ అతని సొంతం. రైనా మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్‌ను ఎంజాయ్‌ చేస్తా. యువరాజ్ ‌సింగ్, వీరేందర్ సెహ్వాగ్‌, రాహుల్ ద్రవిడ్, సచిన్‌ టెండూల్కర్‌ తరహా క్రికెటర్‌. వీరి తరహాలోనే ప్రత్యర్థి బౌలర్లపై పంత్‌ చేసే డామినేషన్‌ బాగుంటుంది' అని పేర్కొన్నాడు.

ఒక్క గాయంతో పంత్ కెరీర్ ప్రశ్నార్థకం:

ఒక్క గాయంతో పంత్ కెరీర్ ప్రశ్నార్థకం:

సీనియర్ వికెట్‌ కీపర్‌ ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడిగా 2017 నుంచి రిషబ్ పంత్ పేరు ఎక్కువగా వినిపించింది. అందుకు తగ్గట్టే బీసీసీఐ సెలెక్టర్లు అవకాశాలు ఇచ్చారు. కానీ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పంత్ గాయపడి.. మ్యాచ్ మధ్యలో దూరమయ్యాడు. కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టి సక్సెస్ కావడంతో.. పంత్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడిపోయింది. ఇప్పుడు వన్డే, టీ20ల్లో టీమిండియా ఫస్ట్ ఛాయిస్ కీపర్‌ కేఎల్ రాహుల్ అయ్యాడు.

28 టీ20ల్లో 410 పరుగులు:

28 టీ20ల్లో 410 పరుగులు:

భారత్ తరఫున 16 వన్డేలాడిన రిషబ్ పంత్ 374 పరుగులు చేశాడు. 28 టీ20ల్లో 410 పరుగులు చేసిన పంత్.. అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాడు. అయినప్పటికీ అతనికి మరికొన్ని అవకాశాలివ్వాలని కొంత మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఐపీఎల్‌లో 54 మ్యాచ్‌లాడిన పంత్.. ఏకంగా 162.7 స్ట్రైక్‌రేట్‌తో 1,736 పరుగులు చేయగా.. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు:

పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు:

లోకేష్ రాహుల్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా రాణించడంతో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. పంత్‌ ఒక టాలెంటెడ్‌ క్రికెటర్‌ అని అతనికి వరుసగా అవకాశాలు ఇస్తే తప్పేముందని చెప్పిన జట్టులోని కొందరు పెద్దలు.. ఇప్పుడు అతని ఉంటే లాభం ఏంటి అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రస్తుత జట్టులో పంత్ లేకున్నా ఏమీ కాదనే సంకేతాలు ఇస్తున్నారు. ఐపీఎల్‌-13వ సీజన్‌తో గాడిలో పడాలని పంత్‌ భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌ జరగడం అనుమానంగా మారింది. ఈ తరుణంలో పంత్‌కు అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టొచ్చు.

Story first published: Tuesday, April 28, 2020, 13:56 [IST]
Other articles published on Apr 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+