ఇంటర్యూ: సురేశ్ రైనా సీక్రెట్ టాలెంట్‌ని వెల్లడించిన అతడి భార్య

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనాలోని మరో టాలెంట్‌ను అతడి భార్య ప్రియాంక రైనా బహిర్గతం చేసింది. రైనా ఓ మంచి సింగర్ అని, పాటలు చాలా బాగా పాడుతాడని తెలిపింది. పాటలు పాడటం అంటే రైనాకు చాలా ఇష్టమని, తన భార్త మంచి గాయకుడు కాగలడని తాను చెప్పగలనని 'మిస్ ఫీల్డ్' అనే వెబ్ సిరిస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
ఈ సందర్భంగా ప్రియాంక రైనా మాట్లాడుతూ "రైనా చాలా అద్భుతంగా పాడతాడు. ఇప్పటికీ అతడు సింగింగ్‌ను ఎంతగానో ఆస్వాదిస్తాడు. అతడో మంచి సింగర్ కాగలడు" అని దండేకర్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపింది. 2015 ఏప్రిల్ 4న రైనా, ప్రియాంకల పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు 20 ఏళ్ల నుంచే ఇద్దరికి పరిచయం ఉంది.
తనకు పదేళ్ల వయసు నుంచే ప్రియాంక... రైనా తెలుసని ప్రియాంక తెలిపింది. స్కూల్లో రైనాకు తన తండ్రి టీచర్, స్పోర్ట్ కోచ్ అని ప్రియాంక తెలిపింది. ఒక టీచర్‌గా రైనాను తన తండ్రి రోజూ చూసేవాడని తెలిపింది. తమ ఇళ్లు పక్కపక్కనే ఉండేవని, దీంతో రైనా అమ్మ, మా అమ్మ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications