
ధోనీ మద్దతు ఇచ్చాడు
ఇటీవల అభిమానులు నిర్వహించిన ఓ షోలో రైనా మాట్లాడుతూ... నిజమే ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. దానికి కారణం మాత్రం నాలో టాలెంట్ ఉందని నమ్మడమే అని అన్నాడు. 'ధోనీ నాకు మద్దతు ఇచ్చాడని నేనే చెప్తాను. అతను నాకు మద్దతు ఇచ్చాడని నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ మద్దతుకు కారణం.. నాలో టాలెంట్ ఉందని మహీ విశ్వసించడమే. ధోనీ నాకు సపోర్ట్ చేసిన ప్రతిసారి నేను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను. అది భారత్ తరఫున కావొచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా కావొచ్చు' అని రైనా వివరణ ఇచ్చాడు.

ధోనీ నుంచి వార్నింగ్ వచ్చేది
'అందరికీ తెలియని ఓ విషయం ఉంది. ఒకవేళ నేను ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలైతే? ధోనీ నుంచి నాకు గట్టిగా వార్నింగ్ వచ్చేది. "నువ్వు స్కోర్లు చేయలేదో? కెప్టెన్‌గా నేను కఠిన నిర్ణయం తీసుకుంటా" అని ధోనీ నాతో చెప్పేవాడు. ఆ సమయంలో.. మహీ భాయ్ ప్లీజ్ ఓ రెండు అవకాశాలివ్వు, మళ్లీ తప్పులు జరగనివ్వను అని కోరేవాడ్ని' అని సురేశ్ రైనా వెల్లడించాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో రైనాకు జట్టులో చోటు విషయంలో ఢోకా ఉండేది కాదు. 2017లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. ఆ తర్వాత ఏడాదే జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక గత రెండేళ్లుగా పునరాగమనం కోసం నిరీక్షిస్తున్నాడు.

భారత్ తరఫున చివరిసారిగా
ఇప్పటి వరకు భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఎలాగైనా ఆ టోర్నీలో ఆడాలనే సంకల్పంతో ఉన్నాడు.

రైనా ఆశలపై కరోనా నీళ్లు
గతేడాది ఆగస్టులో మోకాలి గాయానికి నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇక లాక్‌డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో రైనా పాల్గొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్‌కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఈ సీనియర్ క్రికెటర్ ఆశించాడు. కానీ కరోనా అతని ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుందో లేదోననే సందిగ్ధత నెలకొంది.


Click it and Unblock the Notifications
