For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు బిగ్ షాక్: స్టీవ్ స్మిత్‌కూ

 Suresh Raina Remains Unsold For IPL 2022 Mega Auction
IPL Auction 2022: Suresh Raina Unsold, CSK వెన్నుపోటు | SRH ఏం పీకుతున్నార్రా ? | Oneindia Telugu

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ మెగా వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. శిఖర్ ధావన్‌తో ఆరంభమైందీ ఈవెంట్. ఈ వేలంపాటలో డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ బోణీ కొట్టాడు. పంజాబ్ కింగ్స్ అతణ్ని కొనుగోలు చేసింది. దీనికోసం 8 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఆ తరువాత పలువురు క్రికెటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నారు. స్పీడ్ స్టర్ హర్షల్ పటేల్ భారీ రేటు పలికాడు.

హర్షల్ పటేల్ కోసం పోరు..

హర్షల్ పటేల్ కోసం పోరు..

10 కోట్ల 75 లక్షల రూపాయలతో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అతని బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలు మాత్రమే. ఇదివరకు కూడా అతను అదే టీమ్‌లో ఆడాడు. మళ్లీ అదే టీమ్‌లో చేరాడు. 10 కోట్ల రూపాయల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్. సన్‌రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేయడానికి పోటీ పడింది. హైదరాబాద్-బెంగళూరు మధ్య ఆసక్తికరంగా పోరు సాగింది. ఫలితంగా- హర్షల్ పటేల్ ధర 10 కోట్ల మార్క్‌ను దాటేసింది.

అన్ సోల్డ్‌గా..

అన్ సోల్డ్‌గా..

ఇదంతా ఒక ఎత్తయితే- స్టార్ ప్లేయర్లు అమ్ముడు పోకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫస్ట్ రౌండ్ బిడ్డింగ్‌లో ముగ్గురు స్టార్ క్రికెటర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు. వారిలో ఒకడు సురేష్ రైనా. సురేష్ రైనాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ముందుకు రాలేదు. నిజానికి- సురేష్ రైనాకు మిస్టర్ ఐపీఎల్ అనే పేరు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.

 మిస్టర్ ఐపీఎల్‌గా..

మిస్టర్ ఐపీఎల్‌గా..

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. మెరుపులాంటి ఫీల్డింగ్ సురేష్ రైనా సొంతం. టీ20 ఫార్మట్‌కు అచ్చంగా సరిపోయేలా ఆడే నైజం, సామర్థ్యం సురేష్ రైనాకు ఉంది. అయినప్పటికీ- అతణ్ని ఈ దఫా ఎవరూ కొనుగోలు చేయలేదు. అతని హోమ్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆసక్తి చూపలేదు. ఫలితంగా- ఫస్ట్ రౌండ్ బిడ్డింగ్‌లో మిస్టర్ ఐపీఎల్ అన్ సోల్డ్‌గా మిగిలాడు. ఎవరూ కొనుగోలు చేయని ప్లేయర్ల లిస్ట్ మళ్లీ బిడ్డింగ్‌లో వస్తుంది.

 స్టీవ్ స్మిత్.. మిల్లర్‌కూ షాక్..

స్టీవ్ స్మిత్.. మిల్లర్‌కూ షాక్..

చాలాకాలంగా సురేష్ రైనా క్రికెట్‌కు దూరంగా ఉండటం, గత సీజన్‌లో అర్ధాంతరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టడం వంటి కారణాలు అన్ సోల్డ్‌కు కారణాలు కావచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ డాషింగ్ క్రికెటర్ స్టీవెన్ స్మిత్ సైతం ఫస్ట్ రౌండ్ బిడ్డింగ్‌లో అన్ సోల్డ్‌గా మిగిలాడు. దక్షిణాప్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితీ ఇంతే. ఈ సీజన్ వేలంపాటలో తొలి అన్ సోల్డ్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్. ఆ తరువాత సురేష్ రైనా.. అనంతరం స్టీవెన్ స్మిత్‌‌ను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. మలి విడతలో వారి పరిస్థితి ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంటుంది.

Story first published: Saturday, February 12, 2022, 14:28 [IST]
Other articles published on Feb 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+