అవన్నీ తప్పుడు వార్తలు, నేను బతికే ఉన్నా: సురేశ్ రైనా

Suresh Raina Has Been Angry With The False News Coming Up On Him | Oneindia Telugu

హైదరాబాద్: తాను రోడ్డు ప్రమాదంలో చనిపోయానంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలను టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా ఖండించాడు. కారు ప్రమాదంలో రైనాకు తీవ్ర గాయాలయ్యాయని కొందరు.. ఆ ఘటనలో చనిపోయాడని మరికొందరు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించడంతో రైనా తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తనకేం కాలేదనీ, తాను బతికే ఉన్నట్లు ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు.
'గత రెండు, మూడు రోజులుగా నేను రోడ్డు ప్రమాదానికి గురైనట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇది నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను, శ్రేయోభిలాషులను తీవ్రంగా కలిచి వేసింది. దయచేసి ఇలాంటివి నమ్మొద్దు. ఆ దేవుడి దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను. తప్పుడు వార్తలు సృష్టించిన వారిని గుర్తించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని రైనా ట్వీట్ చేశాడు.
Story first published: Wednesday, February 13, 2019, 9:57 [IST]
Other articles published on Feb 13, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications