రిషభ్ పంత్ ఎప్పుడూ నాతో అదే అంటాడు: సురేశ్ రైనా

న్యూఢిల్లీ: ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కావడమే తన లక్ష్యమని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తరుచూ తనతో చెబుతుంటాడని వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా తెలిపాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో రిషభ్ పంత్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషభ్‌పంత్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి రైనా క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పంత్ తరుచూ తమ ఇంటికి వస్తుంటాడని, తామిద్దరం చాలా క్లోజని చెప్పుకొచ్చాడు.

భయ్యా.. టార్గెట్ అదే..

భయ్యా.. టార్గెట్ అదే..

‘భయ్యా.. వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ కావడమే నా లక్ష్యమని పంత్ తరుచూ నాతో అనేవాడు. వాస్తవానికి అతను సాధించిన ఘనతతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతనో అపార ప్రతిభ కలిగిన యువ ఆటగాడు. నా దృష్టిలో భారతదేశానికి గొప్ప ఆటగాడిగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నాడు. జూన్‌‌లో పేలవ ఆటతీరుతో పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో వాటన్నిటి నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాడు. కానీ నా నుంచి ఎలాంటి పరిష్కారాన్ని, సూచనలను ఆశించలేదు.

పంత్ చాలా క్లోజ్..

పంత్ చాలా క్లోజ్..

పంత్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు అతను మా ఇంటికి వచ్చేవాడు. మా పిల్లలతో ఆడుకునేవాడు. నా భార్యతో మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి నెట్‌ఫ్లిక్స్‌లో కామెడీ సినిమాలు చేసేవాళ్లం. ఇష్టమైన ఫుడ్‌ను తినేవాళ్లం. అతనికి కావాల్సింది అడిగి మరి తెప్పించుకునేవాడు. లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లేవాళ్లం. మ్యూజిక్ వింటూ ఆస్వాదించేవాళ్లం. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినప్పుడు పంత్ తన మనసులోని మాటలను నాతో పంచుకునేవాడు.'అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు రైనా సొంతమైదానంలోఅతనితో కలిసి పంత్ ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా టూర్ హీరో..

ఆస్ట్రేలియా టూర్ హీరో..

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ సాధించిన చారిత్రాత్మక విజయంలో రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చివరిదైన గబ్బా టెస్ట్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను చిత్తు చేసి మ్యాచ్‌ను గెలిపించాడు. సిడ్నీ టెస్ట్‌లోనూ చతేశ్వర్ పుజారాతో నాలుగో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఓటమి నుంచి గట్టెక్కించాడు. మూడు మ్యాచ్‌ల్లో 68.60 సగటుతో 274 పరగులు చేసి సత్తా చాటాడు. ఈ సూపర్ బ్యాటింగ్‌తో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Sunday, January 24, 2021, 16:44 [IST]
Other articles published on Jan 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X