
వేలంలో అన్ని ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు
మరోవైపు 10 ఏళ్ల కాంట్రాక్టు ముగియడంతో అన్ని ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు నేరుగా వేలంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంఛైజీలు ముగ్గురు (ఇద్దరు భారత్ ఆటగాళ్లు, ఒక విదేశీ ఆటగాడు) పాత ఆటగాళ్లను తమతోనే ఉంచుకునే విధానాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. దీనికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలపడంతో ఎవర్ని తమ జట్టులో ఉంచుకోవాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. చెన్నై అభిమానులు ముద్దుగా 'తలా' అని పిలుచుకునే మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే చెన్నై తరుపున ఆడతాడాన్న విషయం ఖరారైంది.

మిగిలిన ఇద్దరిలో ఎవరు అన్నదానిపై చెన్నై తర్జనభర్జన
ఇక మిగిలిన ఇద్దరిలో తమ వద్ద ఉంచుకోవాలన్న దానిపై చెన్నై తీవ్రంగా చర్చించింది. ఈ జాబితాలో చాలా మంది సురేశ్ రైనా ఉంటాడని అంతా భావించారు. కానీ చెన్నై ప్రాంఛైజీ మాత్రం ధోనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, డుప్లెసిస్‌లను తమ వద్ద ఉంచుకుని రైనాను వదులుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెన్నై జట్టు ఈ ముగ్గురు ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ఓ చెన్నైలోని స్థానిక దినపత్రికలో వార్తలు వచ్చాయి. అంతేకాదు తొలి ఎనిమిది సీజన్లో చెన్నై తరుపున ఆకట్టుకున్న రైనాపై చెన్నై టీమ్ యాజమాన్యం ఆసక్తి చూపడం లేదని కూడా అందులో పేర్కొంది.

ప్రతి సీజన్‌లోనూ 400కుపైగా పరుగులు చేసిన రైనా
చెన్నై తరఫున ఆడిన రైనా ప్రతి సీజన్‌లోనూ అద్భుతంగా రాణించాడు. ప్రతి సీజన్‌లోనూ 400కు పైగా పరుగులు సాధించాడు. గత రెండు సీజన్లలో అతడు గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఐపీఎల్ 11వ సీజన్‌ను కొత్త సెట్‌తో నిర్హహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 500 మంది ఆటగాళ్లు వేలంలోకి అందుబాటులో ఉండనున్నారు. గవర్నింగ్ కౌన్సిల్ నియమ నిబంధనలు రూపోందించే వరకు జట్లు తమ వ్యూహాలను రచించలేవు. నవంబర్ 21న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విధివిధానాలను ఖరారు చేయనుంది.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సురేశ్ రైనాను తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దని ఆ జట్టు అధికారిక ట్విట్టర్‌లో అభిమానులను కోరింది. ‘చిన్న తలా తిరిగి జట్టులోకి రావడం లేదని ఆన్‌లైన్‌లో పుకార్లు వస్తున్నాయని, ఇవి నమ్మొద్దని, జట్టు తిరిగి గౌరవం పొందడానికి ప్రయత్నిస్తున్నాం'అని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications