టీమిండియా తరువాతి ధోనీ అతడే: రైనా

చెన్నై: టీమిండియాకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన కృషి అసమానమైనది. మూడు ఐసీసీ ట్రోఫీలను (టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) భారత జట్టుకు అందించాడు. అందుకే ధోనీ స్థానాన్ని భర్తీ చేసే వారి పేరును ఆలోచించాల్సి వచ్చినప్పుడు.. వేరే ఏ ఒక్కరూ గుర్తురారు. అయితే ధోనీలో ఉన్న షేడ్స్‌ను తాను ఓపెనర్ రోహిత్ శర్మలో చూశానని టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అన్నారు.
భారత క్రికెట్ జట్టులో హిట్‌మ్యాన్ మరో ధోనీ లాంటివాడని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ప్రతీ ఆటగాడి సూచనలు, సలహాలకు విలువనిస్తాడని.. అందరినీ గౌరవిస్తాడని రైనా చెప్పుకొచ్చాడు.

అందరినీ గౌరవిస్తాడు
తాజాగా సురేష్ రైనా 'ది సూపర్ ఓవర్ పోడ్‌కాస్ట్ 'తాజా ఎపిసోడ్‌లో భాగంగా సౌతాఫ్రికా క్రికెటర్ జేపీ డుమినితో మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ చాలా కామ్‌గా ఉంటాడు. ఎదుటి వాళ్లు చెప్పేది ఎంతో ఓపికగా వింటాడు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. ముందుండి నడిపిస్తాడు. కెప్టెన్‌గా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో అందరినీ గౌరవిస్తాడు. ప్రతీ ఒక్కరు కెప్టెన్ లాంటి వాళ్లే కదా అంటాడు' అని ఆకాశానికెత్తాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా ఇప్పటివరకు 18 టెస్టుల్లో, 226 వన్డేల్లో, 78 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

టీమిండియా నెక్ట్స్ ధోనీ తనే
'మేము బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ గెలిచినప్పుడు నేను రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాను. అప్పుడు మరింత దగ్గరగా తనను గమనించాను. షార్దుల్ ఠాకూర్, వాషింగ్‌టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్ వంటి యువ ఆటగాళ్లపై అతడు ఎలా విశ్వాసం చూపుతాడో నేను చూశాను. నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోనీ ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్ పేరే చెబుతాను. మహీలాగే రోహిత్ కూడా సానుకూల దృక్పథంతో ఉంటాడు. తనలాగే ఐపీఎల్ టైటిళ్లు గెలిచాడు. జట్టు సారథులుగా వాళ్లలో ఎన్నో సారూప్యతలను నేను చూశాను. సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను. అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించాను' అని రైనా చెప్పుకొచ్చాడు.

రోహిత్ కెప్టెన్సీలో ఆడిన రైనా
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన సురేశ్ రైనా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో నిదహాస్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరినీ దగ్గరినుండి గమనించిన రైనా.. కెప్టెన్‌గా రోహిత్‌కు అద్భుతమైన ఆధారాలున్నాయని అభిప్రాయపడ్డారు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు రోహిత్ 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

రికార్డు స్థాయిలో నాలుగు టైటిళ్లు
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎనిమిదేళ్లలో ముంబై ఇండియన్స్‌ను రికార్డు స్థాయిలో నాలుగు టైటిళ్లను అందించాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీకి విశ్రాంతి, గాయాలైనప్పుడల్లా రోహిత్ కెప్టెన్సీని విజయవంతంగా నడిపించాడు. 2018లో నిదాహాస్ ట్రోఫీ, ఆసియా కప్‌లో రోహిత్ సారథ్యంలో భారత్ విజయాలు సాధించింది. 10 వన్డేల్లో రోహిత్ భారత్‌కు నాయకత్వం వహించగా వాటిలో 8, 20 టీ20లు ఆడగా 16 గెలిచింది.
సచిన్‌కు డబుల్, ట్రిపుల్ సెంచరీలు చేయడం తెలీదు: కపిల్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications