
హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ హిట్టర్ సురేశ్ రైనా.. మైదానంలో బ్యాటింగ్‌తోనే కాదు డ్యాన్స్‌తోనూ (సరదాగా) అభిమానుల్ని అలరించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో శుక్రవారం రాత్రి పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా (46: 29 బంతుల్లో 9x4) వరుస బౌండరీలతో స్కోరు వేగాన్ని అమాంతం పెంచేశాడు. ఈ క్రమంలోనే 12వ ఓవర్ వేసిన గోపాల్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన రైనా.. వైడ్ రూపంలో వచ్చిన ఐదో బంతిని డీప్ ఫైన్‌లెగ్ దిశగా తరలించేందుకు ప్రయత్నించాడు.
బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో రైనా అప్పటికే డీప్ ఫైన్‌లెగ్ దిశగా వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఉండటంతో.. ఈ బంతి కూడా బౌండరీకి వెళ్లిపోయిందేమో అని అంతా భావించారు. కానీ.. లెగ్ స్టంప్‌కి అత్యంత సమీపంగా వెళ్లిన బంతి.. రాజస్థాన్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్ని తాకి.. రివర్స్‌లో రైనా శరీరంపైకి వచ్చింది. అయితే.. బంతి బౌండరీ వెళ్లిందేమో.. అని తొలుత అటు చూసిన బట్లర్ అనంతరం రైనా.. వైపు చూశాడు. అప్పటికే బంతి శరీరాన్ని తాకడంతో అది వెళ్లి వికెట్లపై ఎక్కడ పడుతుందోనని.. కంగారులో రైనా చురుగ్గా కదిలి పాదాల సాయంతో పక్కకి నెట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది. రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లలో బెన్ స్టోక్స్(45) రాణించగా, జాస్ బట్లర్(22) మోస‍్తరుగా ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, డ్వేన్ బ్రేవో, కరణ్ శర్మ, శార్దూల్ ఠాకూర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, వాట్సన్, తాహీర్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్ కాగా, షేన్ వాట్సన్ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 81 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే రైనా తర్వాత వాట్సన్ తన దూకుడును మరింత పెంచాడు.