For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుమార్తె కోసం 'బ్రేక్ ద బియ‌ర్డ్' ఛాలెంజ్‌ని స్వీకరించిన క్రికెటర్

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొద‌లుపెట్టిన బ్రేక్ ద బియ‌ర్డ్ ఛాలెంజ్‌ బాగా పాపులర్ అయింది. ఐపీఎల్ పదో సీజన్ సందర్భంగా రవీంద్ర జడేజా తన అభిమానులకు బ్రేక్ ద బియ‌ర్డ్ అనే ఛాలెంజ్‌ని విసిరాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొద‌లుపెట్టిన బ్రేక్ ద బియ‌ర్డ్ ఛాలెంజ్‌ బాగా పాపులర్ అయింది. ఐపీఎల్ పదో సీజన్ సందర్భంగా రవీంద్ర జడేజా తన అభిమానులకు బ్రేక్ ద బియ‌ర్డ్ అనే ఛాలెంజ్‌ని విసిరాడు.

ఈ ఛాలెంజ్‌ని రోహిత్‌శ‌ర్మ‌, శిఖ‌ర్‌ధావ‌న్‌లాంటి క్రికెట‌ర్లు స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఛాలెంజ్‌ని మరో క్రికెటర్ స్వీకరించాడు. అయితే దానికి కాస్త కూతురు సెంటిమెంట్‌ను జోడించాడు. ఆ క్రికెట‌ర్ ఎవ‌రో కాదు టీమిండియా క్రికెట‌ర్ సురేశ్ రైనా.

గ‌డ్డంతో త‌న కూతురు గ్రేసియా ఇబ్బంది ప‌డుతున్న‌దని, ఆమె కోసం బ్రేక్ ద బియ‌ర్డ్ చాలెంజ్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు.

ఐపీఎల్ జరుగుతున్న సమయంలో రోహిత్‌శ‌ర్మ‌, శిఖ‌ర్‌ధావ‌న్‌లాంటి క్రికెట‌ర్లు జ‌డేజా బ్రేక్ ద బియ‌ర్డ్ చాలెంజ్‌ను స్వీక‌రించారు. గత వారంలో జ‌హీర్ ఖాన్ కూడా గ‌డ్డం తీసి కొత్త లుక్‌లో క‌నిపించాడు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ అనుష్క శ‌ర్మ కోరిక మేర‌కు ఈ ఛాలెంజ్‌కు దూరంగా ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+