గాంధీనగర్: బ్రెండన్ మెక్‌కల్లమ్ విధ్వంసక ఇన్నింగ్స్ పైన సురేష్ రైనా శనివారం నాడు స్పందించాడు. ఈ రికార్డు సాధించడం చాలా సంతోషమని చెప్పాడు. అయితే ఓ భారత ఆటగాడే ఈ రికార్డును బద్దలు కొడతాడని ఆశిస్తున్నట్లు అతను చెప్పాడు.
బ్రెండన్ మెక్‌కల్లమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపిఎల్) మా గుజరాత్ లయన్స్ జట్టుకే ఆడబోతుండటం తమకు కలిసొచ్చే అంశమని చెప్పాడు. మెక్‌కలమ్‌కు భయమన్నదే తెలియదన్నాడు. రైనా శనివారం ఐపీఎల్ జట్టు గుజరాత్ లయన్స్ జెర్సీని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రైనా ఇంకా మాట్లాడుతూ... తాను గత ఎనిమిది ఎడిషన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడానని చెప్పాడు. ఒక్క సంవత్సరం కూడా తనకు చెన్నై జట్టులో గ్యాప్ రాలేదన్నాడు. చెన్నై జట్టుతో అనుబంధం భావోద్వేగంతో కూడుకున్నదని చెప్పాడు. అదే సమయంలో ఇప్పటి టీం కూడా చాలా బాగుందని చెప్పాడు.

కాగా, శనివారం బ్రెండన్ విధ్వంసంక మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. 30 ఏళ్లుగా విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన టెస్టు శతకం రికార్డును శనివారం తిరగరాశాడు మెక్‌కలమ్. 54 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకుని తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు.
టెస్టుల్లో మెక్‌కలమ్ సిక్సర్ల సంఖ్య 106. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు అతడిదే. బ్రెండన్ మెక్‌కలమ్‌కిది 101వ టెస్ట్. అతడికి వందో టెస్టు అయిన గత మ్యాచ్‌లో సరిగ్గా వందో సిక్సర్ బాది.. గిల్‌క్రిస్ట్ రికార్డును సమం చేశాడు.