Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార్యతో కలిసి భయపెట్టిన సురేశ్ రైనా: 'హలోవీన్‌' డేలో ఇలా

హైదరాబాద్: అక్టోబర్ 31ని 'హాలోవీన్‌' డేగా నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. హాలోవీన్‌ డేలో భాగంగా చిత్ర విచిత్ర వేషధారణలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఈ డేని పురస్కరించుకుని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వింత వేషధారణతో కనిపిస్తుంటారు.

కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన నివాసంలో 'హలోవీన్‌' వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా తన భార్యతో కలిసి ఈ హాలోవీన్‌ వేడుకల్లో పాల్గొన్నాడు.

Suresh Raina Halloween celebration with family and Friends

దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో నిర్వహించిన వేడుకల్లో సురేశ్ రైనా తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో రైనా షేర్ చేసుకున్నాడు. 'హ్యాపీ.. స్కేరీ హాలోవీన్‌' అని రైనా కామెంట్ పెట్టాడు.

శిఖర్ ధావన్ కూడా తన కుమార్తె రియా 'హాలోవీన్‌' వేడుకల్లో పాల్గొన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. 'అందరికీ హాలోవీన్‌ శుభాకాంక్షలు. నా కుమార్తె రియా తానే సొంతంగా ఈ కాస్ట్యూమ్‌ను సిద్ధం చేసుకుంది. ఆమె సృజనాత్మకత, ప్రతిభ చూసి నాకెంతో గర్వంగా ఉంది' అని ధావన్‌ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో ఫోటో పెట్టాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+