ఈ ఐపీఎల్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ప్లేయర్ ఎంఎస్ ధోనీ. అతనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ధోనీని చివరిసారి యాక్షన్‌లో చూసేందుకు స్టేడియానికి క్యూలు కడుతున్నారు. చెన్నై ఎక్కడ మ్యాచ్ ఆడినా ఆ స్టేడియం అంతా పసుపు జెండాలతో నిండిపోతోంది.
అలాగే ఈ మ్యాచుల వ్యూయర్‌షిప్ కూడా ఆకాశాన్ని అంటుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ ఆడిన తర్వాత ధోనీ రిటైర్‌మెంట్ ప్రకటించేస్తాడని గతేడాది నుంచి ప్రచారం జరుగుతోంది. గతేడాది రిటైర్‌మెంట్‌పై ప్రశ్న ఎదురైనప్పుడు ధోనీ నవ్వుతూ.. 'నా చివరి మ్యాచ్ చెపాక్‌లో నా ఫ్యాన్స్ ముందే ఆడతా' అని ప్రకటించాడు. అప్పుడు ఐపీఎల్ టోర్నీ భారత్‌లో జరగడం లేదు.

ఇప్పుడు ఈ టోర్నీ మళ్లీ హోం ఎవే ఫార్మాట్‌కు వచ్చేయడంతో ఇదే ధోనీకి చివరి సీజన్ అని ప్రచారం మొదలైంది. అయితే దీనిపై ధోనీ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా ధోనీ సహచరుడు, మాజీ సీఎస్కే ప్లేయర్ సురేష్ రైనా ఈ విషయంపై ఆసక్తికర విషయం వెల్లడించాడు. రిటైర్‌మెంట్ గురించి ధోనీతో మాట్లాడానని చెప్పిన అతను.. ధోనీ ఏమన్నాడో కూడా వెల్లడించాడు.
ప్రస్తుతం జియో సినిమాలో ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో ఉన్న రైనా.. తను ధోనీతో ఈ విషయం మాట్లాడినట్లు చెప్పాడు. అప్పుడు ధోనీ 'మరోసారి ట్రోఫీ గెలవాలని ఉంది. ఆ తర్వాత మరో సీజన్ ఆడతా' అన్నాడట. ఇదే విషయాన్ని రైనా లైవ్‌లో వెల్లడించాడు. దీంతో ధోనీ రిటైర్‌మెంట్ వార్తలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పడుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇటీవల ఒక కార్యక్రమంలో కూడా ధోనీ ఇదే విషయం చెప్పాడు. తను రిటైర్‌మెంట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ తీసుకున్నా సీజన్ మధ్యలో అనవసర ప్రకటనలు చేసి ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టబోనని తేల్చేశాడు. చివరగా లక్నోతో మ్యాచ్‌కు ముందు కూడా ధోనీ ముందు ఈ ప్రస్తావన వచ్చింది.
టాస్ సమయంలో యాంకర్‌గా వచ్చిన డానీ మోరిసన్ మాట్లాడుతూ.. 'ఈ చివరి అందమైన సీజన్.. ఎలా ఎంజాయ్ చేస్తున్నావ్?' అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న వినగానే నవ్వేసిన ధోనీ.. ఇదే తన చివరి సీజన్ అని ఎప్పుడూ చెప్పలేదన్నాడు. 'ఇది నా లాస్ట్ సీజన్ అని నువ్వు డిసైడ్ చేసేశావుగా.. కానీ' అనడంతో మోరిసన్ తెగ ఇబ్బంది పడిపోయాడు.