వైభవంగా రైనా-ప్రియాంకల వివాహం: మోడీ శుభాకాంక్షలు(పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని వివాహమాడి బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడి ఓ సెవెన్ స్టార్ హోటల్లో రైనా వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వివాహానికి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీసమేతంగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
మరో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి వేడుకలో సందడి చేశాడు. వివాహానికి హాజరైన వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, వీరేంద్ర సెహ్వాగ్, రైనా ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్, ఐసిసి అధ్యక్షుడు శ్రీనివాసన్, చెన్నై ఆటగాడు డ్వెన్ బ్రావో, ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, రెజ్లర్ సుశీల్ కుమార్, పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఈ వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకున్నా, సందేశం ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ వేడుకలు ముగిశాక రైనా వెంటనే ఐపీఎల్‌తో బిజీ కానున్నాడు. నెలన్నర పాటు సాగే ఈ లీగ్ ముగిసిన తర్వాత రైనా దంపతులు హనీమూన్‌కు ఇటలీ వెళ్లనున్నారు.

రైనా-ప్రియాంకల వివాహం
భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని వివాహమాడి బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలికాడు.

రైనా-ప్రియాంకల వివాహం
రైనా సతీమణి ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో బ్యాంకర్‌గా విధులు నిర్వహిస్తోంది.

రైనా-ప్రియాంకల వివాహం
శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడి ఓ సెవెన్ స్టార్ హోటల్లో రైనా వివాహ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

రైనా-ప్రియాంకల వివాహం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరూట్‌కు చెందిన ప్రియాంక కుటుంబం ప్రస్తుతం మీరట్‌లో నివాసముంటోంది.

రైనా-ప్రియాంకల వివాహం
ఘజియాబాద్‌లోని కెఐఈటీ ఇనిస్టిట్యూట్‌లో బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె నెదర్లాండ్స్‌లో బ్యాంకర్‌గా విధులు నిర్వహిస్తోంది.

రైనా-ప్రియాంకల వివాహం
రైనా వివాహానికి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీసమేతంగా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

రైనా-ప్రియాంకల వివాహం
శుక్రవారం జరిగిన రైనా వివాహ కార్యక్రమానికి హాజరైన ఐసిసి ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్.

రైనా-ప్రియాంకల వివాహం
శుక్రవారం జరిగిన రైనా వివాహ కార్యక్రమానికి హాజరైన రెస్లర్ సుశీల్ కుమార్, క్రికెటర్లు మోహిత్ శర్మ, స్టెఫెన్ ఫ్లెమింగ్, డ్వేన్ బ్రేవో.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications