Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జడేజా పెళ్లికి కొత్త కళ: రైనా, బ్రేవోల 'గార్భా' డ్యాన్స్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పెళ్లి వేడుకలో సురేష్ రైనా, డ్వేన్ బ్రావోలు చిందేయనున్నారు. గుజరాత్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన రివాబా సోలంకీని జడేజా ఈనెల 17వ తేదీన పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే.

ఈ పెళ్లిలో సురేష్ రైనా, బ్రేవోలు ప్రత్యేకంగా గార్భా డాన్స్ చేయనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కలిసి ఆడినప్పటి నుంచే జడేజా, రైనా, బ్రేవోలు మైదానం బయట కూడా మంచి స్నేహితులు. ఇటీవల గుజరాత్ లయన్స్ జట్టు కోసం రూపొందించిన ఛాంపియన్ సాంగ్‌‌కు జడేజా, బ్రేవోలు కలిసి చిందులేశారు.

వెస్టిండిస్ క్రికెటర్ అయిన డ్వేన్ బ్రావో ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. జడేజా పెళ్లి వేడుకలో బాలీవుడ్ పాటలకు బ్రేవో డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం. జడేజా పెళ్లి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 9వ ఎడిషన్ మధ్యలో జరగనుంది.

Suresh Raina, Dwayne Bravo to perform Garba dance at Ravindra Jadeja's marriage ceremony!

పెళ్లి అనంతరం జడేజా సొంత గ్రామమైన జామ్ నగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. రవీంద్ర జడేజా, సోలంకీ పెళ్లి గుజరాత్‌లోని కలావడ్‌ రోడ్డులో జరగనుంది. కాగా ఛాంపియన్‌ సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించిన బ్రేవో గార్భా డ్యాన్స్‌తో జడేజా పెళ్లి మరింత కళకళలాడుతుందని అంటున్నారు.

కాగా, సోలంకీ ఢిల్లీలోని ఆత్మీయ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. రాజ్‌కోట్‌లో బిజినెస్ మ్యాన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన హర్దేవ్‌సింగ్ సోలంకీ కూతురే రీవా సోలంకీ. రీవా తల్లి ప్రఫుల్లాబా సొలంకీ.. ఇండియన్ రైల్వేలో ఉద్యోగి కాగా, ఆమె తండ్రి వ్యాపారవేత్త. ఇదిలా ఉంటే పెళ్లికి ముందే కాబోయే అల్లుడికి జడేజా అత్తింటివారు భారీ కానుకను అందించారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+