సురేశ్ రైనా ఖాతాలో అరుదైన ఘనత: ఐపీఎల్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన‍్నై సూపర్ సింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ అన్ని సీజన్లలో 300కు పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా సురేశ్ రైనా రికార్డు సాధించాడు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో సురేశ్ రైనా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు (12) బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా చెన్నై ఇన్నింగ్స్ 10వ ఓవర్ రెండో బంతికి ఈ సీజన్‌లో మూడొందల పరుగుల మార్కును అందుకున్నాడు. ఫలితంగా ప్రతీ ఐపీఎల్ సీజన్‌లో మూడొందలకు పైగా పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రైనా నిలిచాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 11వ సీజన్ అన్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన ఐపీఎల్ 10వ సీజన్‌లో సురేశ్ రైనా టాప్-10లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో హాఫ్ సెంచరీ(52) అనంతరం స్టువర్ట్ బిన్నీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తాజా హాఫ్ సెంచరీతో రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా రైనా(557) మరో ఘనత సాధించాడు.
ఐపీఎల్ సీజన్లలో సురేశ్ రైనా చేసిన పరుగులు:
2018 సీజన్‌లో- 313 పరుగులు(ప్రస్తుతానికి)
2017 సీజన్‌లో - 442 పరుగులు
2016సీజన్‌లో - 399 పరుగులు
2015 సీజన్‌లో - 374 పరుగులు
2014 సీజన్‌లో - 523 పరుగులు
2013 సీజన్‌లో - 548 పరుగులు
2012 సీజన్‌లో - 441 పరుగులు
2011 సీజన్‌లో - 438 పరుగులు
2010 సీజన్‌లో - 520 పరుగులు
2009 సీజన్‌లో - 434 పరుగులు
2008 సీజన్‌లో - 421 పరుగులు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications