
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 200 మ్యాచ్ ఆడిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. అంతేకాదు 200 మ్యాచ్ ఆడిన రెండో సీఎస్‌కే ఆటగాడిగా కూడా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్ ద్వారా రైనా ఈ ఫీట్‌ను సాధించాడు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ఐపీఎల్ టోర్నీలో 200 మ్యాచులు ఆడిన విషయం తెలిసిందే.
ఓవరాల్‌గా ఐపీఎల్ టోర్నీలో 200వ మ్యాచ్‌లు ఆడిన నాలుగో ప్లేయర్‌గా సురేష్ రైనా గుర్తింపు పొందాడు. అంతకుముందు ఎంఎస్ ధోనీ (210), ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ (206), కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ (203)లు 200 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ 200వ ఐపీఎల్ మ్యాచ్‌కు అడుగుదూరంలో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకోనున్నాడు. ప్రస్తుతం అతడు 199 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
ఇటీవలే ఐపీఎల్‌లో సురేష్ రైనా ఓ ఘనతను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన 7వ క్రికెటర్‌గా నిలిచాడు. మార్చి 19న ముంబైలోని వాంఖడే స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైనా రెండు సిక్స్‌లు కొట్టడం ద్వారా 200 సిక్సర్ల మార్కును చేరాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రైనా ఆ రెండు సిక్స్‌లను కొట్టాడు. టోర్నీలో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు విండీస్ హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌పై ఉంది. గేల్ 356 సిక్సర్లతో టాప్‌లో ఉన్నాడు.
శనివారం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరాటంలో చెన్నైపై ముంబై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 కెట్లకు 218 పరుగులు చేసింది. మొయిన్ అలీ (58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫాఫ్ డుప్లెసిస్ (50; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలు సాధిస్తే.. అంబటి రాయుడు (27 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లక్ష్య ఛేదనలో పొలార్డ్ (34 బంతుల్లో 87; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.