For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హమ్మయ్య!: సురేశ్ రైనా యో-యో టెస్టు పాసయ్యాడు

By Nageshwara Rao
Suresh Raina clears Yo-Yo test ahead of South Africa tour

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా యో-యో టెస్టులో పాసయ్యాడు. ఈ విషయాన్ని సురేశ్ రైనా తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే యో-యో టెస్టులో పాస్‌ తప్పనిసరి అంటూ బీసీసీఐ సెలక్టర్లు కొత్త నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

గత కొన్నాళ్లుగా యో-యో టెస్టులో విఫలమవ్వడంతో సురేశ్ రైనా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో గురువారం నిర్వహించిన యో-యో టెస్టులో 31 ఏళ్ల సురేశ్ రైనా పాసయ్యాడు.

నేషనల్ క్రికెట్ అకాడమీలోని కోచ్‌లు, ట్రైనర్లతో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా రైనా ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. 'ఎన్నో రోజుల సాధన తర్వాత ఎన్‌సీఏలో నిర్వహించిన యో-యో టెస్టులో పాసయ్యాను. ట్రైనర్లు, కోచ్‌లు, నిర్వాహకులు నుంచి ఎంతో మద్దతు లభించింది. ఇక్కడి శిక్షణ ఎంతో ప్రోత్సాహం, స్ఫూర్తిని కలిగిస్తుంది. నా లక్ష్యాలను గుర్తు చేస్తూ నాలో దాగి ఉన్న ప్రతిభను బయటికి తీస్తుంది' అని రైనా ట్వీట్ చేశాడు.

యో-యో టెస్టులో సురేశ్ రైనా పాసవ్వడంతో ఇకపై సెలక్టర్లకు అందుబాటులోకి వచ్చినట్లే. 16.1 అర్హత మార్కుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆటగాళ్లకు యో-యో పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇటీవలే టీమిండియా వెటరన్ క్రికెటర్
యువరాజ్ సింగ్ ఈ టెస్టులో 16.3 పాయింట్లతో పాసైన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 15:57 [IST]
Other articles published on Dec 21, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+