Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ ఇంట్లో రైనా పుట్టినరోజు: పక్కనే భార్య ప్రియాంక, కుమార్తె గ్రేసియా

Suresh Raina Celebrates 31st Birthday; Gets Invited for Lunch by Sachin

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా తన 31వ పుట్టినరోజుని జరపుకున్నాడు. సోమవారం సురేశ్ రైనా పుట్టిన రోజు సందర్భంగా అతడి కుటుంబాన్ని సచిన్‌ టెండూల్కర్ తన ఇంటికి లంచ్‌కి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా సురేశ్ రైనాకు కేక్‌ తినిపి స్తోన్న ఫొటోను సచిన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

పక్కనే రైనా భార్య ప్రియాంక, కూతురు గ్రేసియా కూడా ఫొటోలో ఉన్నారు. ఇదిలా ఉంటే సచిన్ టెండూల్కర్ ఆతిథ్యానికి సురేష్‌ రైనా ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు సురేశ్ రైనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటిలాగే సెహ్వాగ్ తనదైన శైలిలో రైనాకు పుట్టినరోజు విషెస్ చెప్పాడు.

ప్రస్తుతం సురేశ్ రైనా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. భారత్ తరుపున చివరిసారిగా ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టీ20లో కనిపించాడు. 2015 నుంచి భారత్ వన్డే, టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు 223 వన్డేలాడిన రైనా 5568 పరుగులు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 10:54 [IST]
Other articles published on Nov 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+