నిను చూడకుండా ఉండలేకపోతున్నా: భార్యపై రైనా ట్వీట్
చెన్నై: కొత్తగా పెళ్లైన యువ క్రికెటర్ సురేష్ రైనా తన భార్య ప్రియాంకను చూడకుండా ఉండలేకపోతున్నాడట. పెళ్లైన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సురేష్ రైనా చేరిపోయాడు.
అప్పటి నుండి తీరికలేకుండా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ముగింపు దశలో ఆయన తన సతీమణికి ట్వీట్ చేశాడు.

బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం సహచరులంతా వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైతే చెన్నై ఆటగాడు రైనా మాత్రం భార్య గురించి ట్వీచ్ చేశాడు. బిజీ షెడ్యూల్ కారణంగా తాను భార్య ప్రియాంక చౌదరిని బాగా మిస్సవుతున్నానని అభిప్రాయపడ్డాడు.
ట్విట్టర్‌లో ప్రియాంక ఫొటోను పోస్ట్ చేసిన రైనా 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా మై లవ్' అంటూ రాసి తన బాధను అందరికీ తెలియజేశాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే భార్య కోసం అతను సమయం కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications