Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త లుక్‌: బ్రేక్‌ ది బియర్డ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన రైనా (వీడియో)

Suresh raina break the beard challenge 2018

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేశ్ రైనా బ్రేక్‌ ది బియర్డ్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఈ బ్రేక్‌ ది బియర్డ్ ఛాలెంజ్‌‌ను స్వీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి సురేశ్ రైనా కూడా చేరాడు.

ఈ సీజన్‌లో సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున మిడిలార్డర్‌లో నిలకడగా ఆడుతూ అద్భుత విజయాలను అందిస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు కొంత విరామం లభించడంతో రైనా ఓ న్యూ లుక్‌లోకి వచ్చేశాడు. టోర్నీ ఆరంభం నుంచీ కాస్త గడ్డంతో రఫ్ లుక్‌లో కనిపించిన రైనా.. ఇప్పుడు ట్రెండీ ఫ్రెంచ్ కట్ గడ్డంతో, స్పైక్ హెయిర్ స్టైల్‌లోకి మారిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను సురేశ్ రైనా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. 'సీజన్ హోరాహోరీగా సాగుతుంది.. ఇంకొ లెవల్‌కి మారేందుకు ఇంకా బ్రేక్‌ ది బియర్డ్ చేసేందుకు ఇది సరైన సమయం.. నా ఫ్యాన్స్‌ అందరికి ఎల్లవ్(ఎల్లో లవ్). మీ మద్దతు ఎప్పుడూ ఇలానే ఉండాలని అనుకుంటున్నా' అని రైనా క్యాప్షన్ పెట్టాడు.

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో ఏడింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం(11 మే)న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది.

Story first published: Wednesday, May 9, 2018, 19:21 [IST]
Other articles published on May 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+