Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

33వ పడిలోకి సురేశ్ రైనా: 'చిన్న తలా' అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్!

Suresh Raina Birthday Special: Catches Which Prove ‘Chinna Thala’ Is Pure Magic On Cricket Field

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా బుధవారం 33వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సురేశ్ రైనాకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రైనా పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో 'చిన్న తలా' ట్యాగ్‌ని చెన్నై అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా, సురేశ్ రైనా టీమిండియా సాధించిన అనేక అద్భుతమైన విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. సొంతగడ్డపై 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం రైనానే.

ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా టీమిండియా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సురేశ్ రైనా (34; 28 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్), పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్లో (36; 39 బంతుల్లో 3 ఫోర్లు) కీలక సమయంలో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియా ఫైనల్‌కు చేరేందుకు సాయపడ్డాడు.

ఇక, 2008 ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో టీమిండియా 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రైనా(116 నాటౌట్) సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు.

రైనా పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు:

Story first published: Wednesday, November 27, 2019, 15:38 [IST]
Other articles published on Nov 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+