Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి భారత క్రికెటర్‌గా సురేశ్ రైనా: ఎలైట్ జాబితాలో ధోని సరసన

Suresh Raina Becomes First Indian Batsman To Score 8,000 Runs In T20s | Oneindia Telugu
Suresh Raina becomes first Indian batsman to score 8,000 runs in T20s, joins MS Dhoni in elite list

హైదరాబాద్: టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర‍్నమెంట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌ తరఫున ఆడుతున్న రైనా సోమవారం పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు.

18 బంతుల్లో 12 పరుగులు చేసిన రైనా

18 బంతుల్లో 12 పరుగులు చేసిన రైనా

ఈ మ్యాచ్‌లో 32 ఏళ్ల సురేశ్ రైనా 18 బంతుల్లో 12 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం సురేశ్ రైనా 300 మ్యాచుల్లో 8001 పరుగులు చేశాడు. మొత్తంగా టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల్ని సాధించిన ఆరో క్రికెటర్‌గా రైనా నిలిచాడు.

అగ్రస్థానంలో క్రిస్ గేల్

అగ్రస్థానంలో క్రిస్ గేల్

ఈ జాబితాలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ 269 మ్యాచుల్లోనే 12298 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెండన్ మెకల్లమ్ (370 మ్యాచుల్లో 9922 పరుగులు), కీరన్ పొలార్డ్ (8838), షోయబ్ మాలిక్ (8603), డేవిడ్ వార్నర్ (8111)లు ఉన్నారు.

ధోని తర్వాత సురేశ్ రైనానే

ధోని తర్వాత సురేశ్ రైనానే

ఇక, బారత తరుపున ఈ జాబితాలో రైనా తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 251 మ్యాచుల్లో 7833 పరుగులు చేశాడు. దీంతో పాటు ధోనీ (301) తర్వాత మూడొందల టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రైనా అరుదైన గుర్తింపు పొందాడు. మూడోస్థానంలో రోహిత్ శర్మ (299) ఉన్నాడు.

Story first published: Monday, February 25, 2019, 17:45 [IST]
Other articles published on Feb 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+