'రైనా' జట్టులోకి వచ్చింది అందుకోసమేనా...?

హైదరాబాద్: దాదాపు రెండున్నరేళ్ల పాటు నిరీక్షించి భారత జట్టులో చోటు సంపాదించిన రైనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్యాట్ ఝుళిపించి మెరుపులు పుట్టించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో స్పిన్ బౌలింగ్ వేసి వికెట్లు పడేయగలడు. అద్భుతమైన ఫీల్డింగ్ సైతం చేయగలడు.
కానీ, భారత జట్టుకు దూరంగా ఉన్న రైనా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్‌లో రాణించి మిగతా యువ క్రికెటర్లకు సవాల్ విసిరాడు. టీమిండియా క్రికెట్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆల్‌రౌండర్ సురేశ్ రైనా, ఇతని దృష్టి మొత్తం 2019 ప్రపంచకప్‌పైనే ఉంది అప్పటికి భారత వన్డే జట్టులో చోటు దక్కించుకోవాలనేది అతని లక్ష్యం.

మరింత సుస్థిరం చేసుకునే పనిలో:
ఆ క్రమంలోనే సఫారీలతో టీ20 సిరీస్‌లో రైనా తన మార్కు ఆటను చూపెట్టాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 15, 31, 43 స్కోర్లు సాధించాడు. అంతేకాదు భారత జట్టు టీ 20 సిరీస్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌లో రాణించి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. దాని కోసమే ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టేశాడు.

టీ 20 వరల్డ్ కప్‌లో మొదటి సెంచరీ:
టీ 20ల్లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్ రైనా కాగా, టీ 20 వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ కూడా. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడు కూడా రైనానే. ఇక వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో సెంచరీలు చేసిన తొలి టీమిండియా క్రికెటర్ ఘనత రైనా సొంతం. ఇవన్నీ రైనా తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడానికి ఉపయోగపడ్డాయనే చెప్పాలి.

రైనాను మూడో స్థానంలో బరిలోకి:
భారత జట్టులో రిజర్వ్ బెంచ్ సత్తా ఉన్నప్పటికీ రైనాకు మరో అవకాశం ఇవ్వడానికి కారణం మాత్రం వచ్చే వరల్డ్ కప్‌కు ముందుగా చేసిన ప్రయోగంగానే కనబడుతోంది. సఫారీలతో సిరీస్‌లో రైనా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే రైనా రీ ఎంట్రీకి ముందు కోహ్లినే ఈ స్థానంలో బరిలోకి దిగేవాడు. అయితే రైనాను మూడో స్థానంలో బరిలోకి దింపి, కోహ్లి నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే మన బ్యాటింగ్ విభాగం మరింత బలపేతమవుతుందనేది టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచన.

మిడిల్ ఆర్డర్ కోసం పాట్లు:
గత కొంతకాలంగా నాల్గో స్థానంలో టీమిండియా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రధానంగా ఈ స్థానంలో అజింక్యా రహానే, మనీష్ పాండేలతో పాటు పలువురు ఆటగాళ్లను పరీక్షించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ క్రమంలోనే రైనా పునరాగమనం సులువుగా మారింది. మూడో స్థానంలో రైనా బ్యాటింగ్‌కు వస్తే, నాల్గో స్థానంలో పరుగుల మెషీన్ కోహ్లి ఉండనే ఉన్నాడు. ఈ రెండు స్థానాలను పటిష్టం చేస్తే ఏడో స్థానం వరకూ మన బ్యాటింగ్‌కు ఢోకా ఉండదు.

ఐదో స్థానంలో కూడా రైనా:
ఇక ఐదో స్థానంలో కూడా రైనా బ్యాటింగ్ అతికినట్లు సరిపోతుంది. ఇక్కడ కూడా భారత బ్యాటింగ్‌లో కొద్దిపాటి వైఫల్యం కనబడుతోంది. ఆ నేపథ్యంలో వరల్డ్ కప్ నాటికి రైనాను ప్రయోగిద్దామనే కారణంతో అతనికి జాతీయ జట్టులో మరొకసారి చోటు కల్పించారనేది కాదనలేని వాస్తవం. ఈ క్రమంలోనే శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ 20 సిరీస్ రైనా ఒక సవాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications