
ఆ సిరీస్‌కు అందుబాటులో..
సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు ఆడనున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటానని సురేష్ రైనా తేల్చి చెప్పాడు. ఈ నెల 10వ తేదీన రోడ్ సెఫ్టీ వరల్డ్ సిరీస్ ఆరంభం కానుంది. కాగా- దక్షిణాఫ్రికాలో జరుగనున్న టీ20 సిరీస్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టోర్నమెంట్స్ ఫ్రాంఛైజీలు తనను సంప్రదిస్తోన్నాయని, వాటిల్లో ఆడాలా? లేదా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌కు ఆడతానని వివరించాడు.

ట్రాక్ రికార్డ్..
ఐపీఎల్‌లో సురేష్ రైనాకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు అతను ప్రాతినిథ్యాన్ని వహించాడు. 2008లో తొలి సీజన్ నుంచీ అతను ఆడుతూ వస్తోన్నాడు. 2020లో తప్ప అన్ని సీజన్లల్లో అతను పార్టిసిపేట్ అయ్యాడు. 2020లో వివాదాస్పద కారణాలతో అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాతి సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయాడు.

మిస్టర్ ఐపీఎల్..
ఐపీఎల్ కేరీర్‌లో 205 మ్యాచ్‌లను ఆడాడు. 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా 548 పరుగులు చేశాడు. 2021 తప్పించితే మిగిలిన అన్నింట్లోనూ నిలకడగా రాణించాడు సురేష్ రైనా. దీనితో మిస్టర్ ఐపీఎల్ అనే గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ కేరీర్‌పైనా తనదైన ముద్ర వేశాడు. 13 సంవత్సరాల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యాన్ని వహించాడు.

13 ఏళ్ల కేరీర్..
జాతీయ జట్టు తరఫున మొత్తంగా 18 టెస్ట్, 226 వన్డే ఇంటర్నేషనల్స్, 78 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వన్డేల్లో 5,615, టీ20 ఇంటర్నేషనల్స్‌లో 16.05 పరుగులు చేశాడు. కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తోన్నాడు. అతను త్వరలోనే అన్ని ఫార్మట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పొచ్చంటూ వార్తలు వెలువడ్డాయి. దీనికి అనుగుణంగా తన నిర్ణయాన్ని ఇవ్వాళ ప్రకటించాడు సురేష్ రైనా.


Click it and Unblock the Notifications












