Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిస్టర్ కూల్ కాదు: ధోని గురించి రైనా చెప్పిన సీక్రెట్ ఇదే (వీడియో)

హైదరాబాద్: అభిమానులు అనుకుంటున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మిస్టర్ కూల్ కాదంట. ఈ విషయాన్ని ధోనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన జట్టులోని సహచర ఆటగాడు సురేశ్ రైనా వెల్లడించాడు. 'బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌' అనే వెబ్‌ సిరీస్‌లో ధోని గురించి రైనా మాట్లాడుతూ మైదానంలో ఎంతో ప్రశాంతంగా కనిపించే ధోనిని చూసి అందరూ మిస్టర్‌ కూల్‌ అనుకుంటారు కానీ ధోని నిజానికి మిస్టర్‌ కూల్‌ కాదని అన్నాడు.

 ధోని మైదానంలో దేని గురించి ఆలోచిస్తాడో ఎవరికీ అర్ధం కాదు

ధోని మైదానంలో దేని గురించి ఆలోచిస్తాడో ఎవరికీ అర్ధం కాదు

‘ధోని మైదానంలో దేని గురించి ఆలోచిస్తాడో ఎవరికీ అర్ధం కాదు. మ్యాచ్‌ మధ్యలో అతనికి కోపం వచ్చినప్పటికీ దానిని కనిపించనివ్వడు. ఓవర్‌ ముగిశాక టీవీల్లో ఎప్పుడైతే ప్రకటనలు మొదలవుతాయో అప్పుడు మాత్రం తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఇది టీవీల్లో కనిపించదు. అందుకే అందరూ ధోనిని మిస్టర్‌ కూల్‌ అంటుంటారు' అని రైనా తెలిపాడు.

ఉమర్‌ అక్మల్‌ నాపై ధోనికి ఫిర్యాదు చేశాడు

ఉమర్‌ అక్మల్‌ నాపై ధోనికి ఫిర్యాదు చేశాడు

ఇందుకు సంబంధించి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన సంఘటనను రైనా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. 'ఒకసారి భారత్‌-పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగినప్పుడు ఉమర్‌ అక్మల్‌ నాపై ధోనికి ఫిర్యాదు చేశాడు. ధోని వచ్చి ఏం జరిగింది అని నన్ను అడిగాడు. పాక్‌ ఆటగాళ్ల మీద ఒత్తిడి పెంచేందుకు బంతులు విసురుతున్నాను అని చెప్పాను' అని పేర్కొన్నాడు.

 ధోని ఏమన్నాడో తెలుసా?

ధోని ఏమన్నాడో తెలుసా?

'ఇందుకు ధోని ఏమన్నాడో తెలుసా... మరిన్ని ఎక్కువ బంతులు విసిరి వారిపై ఒత్తిడి పెంచు అని అన్నాడు. ధోని మ్యాచ్‌ను ఎంతో బాగా అర్ధం చేసుకుంటాడు. మ్యాచ్‌ జరిగే సమయంలో ఏం జరుగుతుందో ముందే పసిగెట్టేస్తాడు. అతని వద్ద ఎప్పుడూ మూడు ప్లాన్‌లు ఉంటాయి. ప్లాన్‌-ఎ, ప్లాన్‌-బి, ప్లాన్‌-సి' అని వెల్లడించాడు.

ధోని వద్ద ఎప్పుడూ మూడు ప్లాన్‌లు ఉంటాయి

'ఈ మూడింటిని మ్యాచ్‌ మధ్యలో ఎప్పుడైనా ధోని ఉపయోగిస్తాడు. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి మాత్రమే ఈ ప్లాన్‌లు సిద్ధం చేసుకుంటాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పరిస్థితులను బట్టి వాటిని వాడతాడు. అందుకే అతడు మైదానంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా, కూల్‌గా కనిపిస్తాడు' అని సురేశ్ రైనా తెలిపాడు.

Story first published: Wednesday, November 29, 2017, 11:08 [IST]
Other articles published on Nov 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+