Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనురాగ్ ఠాకూర్ తొలగింపు: ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?

హైదరాబాద్: బీసీసీఐపై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది. సంస్కరణల అమలు విషయంలో లోధా కమిటీ, బీసీసీఐ మధ్య నడుస్తున్న కేసు వివాదంపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం కోర్టు సోమవారం ఎట్టకేలకు తుది తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు బీసీసీఐ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అజయ్‌ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది.

వివరాల్లోకి వెళితే క్రికెట్‌ ప్రక్షాళనకు చేపట్టాల్సిన సంస్కరణలతో కూడిన నివేదికను లోధా కమిటీ 2016, జులై 18న సుప్రీంకోర్టుకు సమర్పించింది. కూలింగ్ ఆఫ్ పిరియడ్, ఒక రాష్ట్రానికి ఒకే ఓటు, 70 ఏళ్లు పైబడిన వారు రాజకీయ నేతలు క్రికెట్‌ సంఘాల్లో ఎలాంటి పదవులు చేపట్టారని కమిటీ సూచించింది.

ఈ క్రమంలో సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధంగా అజయ్‌ షిర్కేను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అంతేకాదు లోధా కమిటీ సూచించిన పలు సిఫారసులను సైతం బీసీసీఐ బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తూ వచ్చారు. లోధా కమిటీ పేర్కొన్న కొన్ని సిఫారుసులను అమలు చేయడం కష్టసాధ్యమని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు గతంలోనే బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని గత విచారణ సందర్భంగా కోర్టు అనురాగ్‌ ఠాకూర్‌ను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం బీసీసీఐకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవటంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.

సుప్రీం కోర్టు తాజా తీర్పుతో బోర్డులోని కీలక పదవులను కోల్పోనున్నారు. బీసీసీఐలో సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు న్యాయవాదులను సైతం సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. తొలగించిన వారి స్ధానంలో బోర్డు సభ్యులుగా కొత్తవారిని జనవర్‌ 19న ప్రకటిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

సుప్రీం కోర్టు తీర్పుపై ఏవరేమన్నారు:

అజయ్ మీమన్

కీలక నిర్ణయం: బీసీసీఐ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అజయ్‌ షిర్కేలను సుప్రీం కోర్టు పదవుల నుంచి తొలగించింది.

హర్షా బోగ్లే

గత కొన్నాళ్లుగా ఇండియన్ క్రికెటర్‌ను ఫాలోఅవుతున్నాను. ఇన్నాళ్లు ఇలాంటి నిర్ణయాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఈ తీర్పు వెనకున్న నిబద్ధం కోసం వెయిట్ చేస్తున్నాను.

ప్రేమ్ పనిస్కర్

నువ్వు బీసీసీఐవి గనుక అయితే ఈ ఇయర్‌కు ఇది మంచి శుభారంభం కాదు. తీర్పు హైలెట్‌గా ఉంది.

రాహుల్ కన్వాల్

బీసీసీఐ టాప్ ఆర్డర్‌ను సుప్రీం కోర్టు క్లీన్ బౌల్డ్ చేసింది. అనురాగ్ ఠాకూర్‌ను అవుట్ గా డిక్లేర్ చేసింది. థర్డ్ అంపైర్ రివ్యూ లేనందుకు బ్యాట్స్ మెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మిహిర్ వాస్వాడా

స్పాట్ ఫిక్సింగ్ విచారణ ఇద్దరు బీసీసీఐ అధ్యక్షులైన అనురాగ్ ఠాకూర్, ఎన్ శ్రీనివాసన్ ను తప్పించే వరకు వెళ్లింది.

ఓ అభిమాని

దేశంలో ఉన్న పెండింగ్ కేసులను విచారించేందుకు సుప్రీం కోర్టు తగినంత మంది జడ్జిలను అపాయింట్ చేయలేదు. అయితే క్రికెట్ బోర్డు ప్రక్షాళనకు పూనుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+