పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే: 2013 స్ఫాట్ ఫిక్సింగ్ కేసుపై శ్రీశాంత్


హైదరాబాద్: 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకునేందుకే తాను తప్పు చేసినట్లు అంగీకరించాల్సి వచ్చిందని టీమిండియా పేసర్ శ్రీశాంత్ సుప్రీం కోర్టుకు తెలిపాడు. 2013 ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతనిపై క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీనిపై శ్రీశాంత్ న్యాయపోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ కేసును విచారించింది. శ్రీశాంత్ తరఫున న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ అతడి వాదనను కోర్టులో వినిపించాడు. పోలీసుల చిత్రహింసల నుంచి తప్పించుకోవడానికే శ్రీశాంత్ నేరాన్ని అంగీకరించాడని ఖుర్షీద్ కోర్టుకు వివరించారు.

స్పాట్ ఫిక్సింగ్ కోసం బుకీలు సంప్రదించినప్పటికీ
తనను స్పాట్ ఫిక్సింగ్ కోసం బుకీలు సంప్రదించినప్పటికీ తాను ఫిక్సింగ్‌కు పాల్పడలేదని శ్రీశాంత్ చెప్పగా.. బుకీలు సంప్రదించిన విషయాన్ని బీసీసీఐకి ఎందుకు చెప్పలేదంటూ ద్విసభ్య బెంచ్ ప్రశ్నించింది. మైదానంలో టవల్‌తో తుడుచుకోవడం, ఆడించడమనేది సహజమని, ఇలా అందరు క్రికెటర్లు చేస్తారని దీన్ని ఫిక్సింగ్‌కు సంజ్ఞగా భావించడం తగదని ఖుర్షీద్ వాదించారు.

శ్రీశాంత్ ఓవర్‌కు 14 పరుగులు ఇవ్వాలి
బుకీలతో జరిగిన సంభాషణ ప్రకారం ఫిక్సింగ్ జరిగినట్లు భావిస్తున్న మ్యాచ్‌లో శ్రీశాంత్ ఓవర్‌కు 14 పరుగులు ఇవ్వాల్సి ఉందని, కానీ అతనిచ్చింది 13 పరుగులే (క్రీజులో గిల్‌క్రిస్ట్, షాన్ మార్ష్ లాంటి మెరుగైన బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నప్పటికీ) అని.. అలాంటపుడు అతను ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఎలా భావిస్తారని ఖుర్షీద్ ప్రశ్నించాడు.

గరిష్టంగా ఐదేళ్లు మాత్రమే నిషేధం విధించాలి
బుకీలతో ఫిక్సింగ్ కోసం సంప్రదింపులు జరిపినట్లైతే గరిష్టంగా ఐదేళ్లు మాత్రమే నిషేధం విధించాలని, కానీ శ్రీశాంత్‌పై జీవిత కాల నిషేధం విధించడం అన్యాయమని ఖుర్షీద్ వాదించారు. తనను బుకీలు సంప్రదించడంపై బీసీసీఐకి శ్రీశాంత్ సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టి సుప్రీం, అతడి ప్రవర్తన సరిగా లేదని స్పష్టం చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications