వయస్సు ఎక్కువైందంటూ అండర్ 19 జట్టుకు..: ఆరోపణలపై కల్రా

హైదరాబాద్: మన్‌జోత్ కల్రా ఈ పేరు అండర్ 19 జట్టులో చాలా ఫేమస్ అయిపోయంది. ఎంత అంటే దాదాపు ఆ జట్టు కెప్టెన్ తో పాటు సమంగా. కారణం వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుపై విరుచుకుపడి సెంచరీ బాదాడు. అప్పటి వరకు ఏ అంచనాలను అతనిపై ఉంచని సగటు అభిమానిని ఒక్కసారిగా అతని ఆటతీరుతో కట్టిపడేశాడు.
ఆ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కల్రా 'నాకు ఇది చాలా గొప్ప అనుభవం. మొదట్లో కాస్త భయపడినా ఒక్కో మ్యాచ్ కు ఆత్మ విశ్వాసం పెరుగుతూ వచ్చిందని పేర్కొన్నాడు. ఒకానొక సందర్భంలో కల్రాపై వచ్చిన ఆరోపణల కారణంగా అతను జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చేదట.
'నాకు అండర్ 19 జట్టులో ఆడేందుకు వయస్సు ఎక్కువైందంటూ ఆరోపణలు వచ్చాయి. వయస్సు నిర్ధారణ కోసం పరీక్షలు కూడా చేయించుకున్నాను. ఆ సమయంలో నేను చాలా భయపడ్డా. కానీ, అప్పుడు మా పేరెంట్స్ నాకు అండగా నిలిచారు. భయపడొద్దని ఆట మీదే ధ్యాస పెట్టమని చెప్పడంతో నేను ఇక్కడి వరకూ రాగలిగాను.' అని పేర్కొన్నాడు.
కాగా, ప్రస్తుతం అతని ఆటతీరును చూసి కోహ్లీ, యువరాజ్‌లతో పోల్చే స్థాయికి కల్రా ఎదిగిపోయాడు. అయితే ఆ పొగడ్తలు స్వీకరించేంత గొప్పవాడ్ని కాదని అన్నాడు. అండర్ 19 జట్టు కెప్టెన్ పృథ్వీ షాకు తనకు మంచి అనుబంధం ఉందని దాంతోనే మ్యాచ్ లో ఆడేందుకు సమన్వయం బాగా కుదిరిందని తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications