Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 Challenge: అమ్మాయిల ధనాధన్‌ షురూ.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మిథాలీ!!

Supernovas vs Velocity: Velocity have won the toss and have opted to field

షార్జా: పురుషులతో పాటు మహిళలు కూడా ధనాధన్‌ లీగ్‌ ఐపీఎల్‌లో సందడి చేయనున్నారు. మహిళల మినీ ఐపీఎల్‌ మూడో సీజన్‌ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. మహిళల టీ20 ఛాలెంజ్‌ 2020లో భాగంగా సూపర్‌ నోవాస్‌, వెలాసిటీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన వెలాసిటీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లీగ్ జరుగుతుండడం సంతోషం అని మిథాలీ పేర్కొంది. యువ ప్లేయర్లకు ఇదో మంచి అవకాశం అని చెపింది. మరోవైపు నోవాస్‌ సారథి హర్మన్‌ ప్రీత్ కౌర్ కూడా ఆనందం వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతున్నామంది.

భారత క్రీడాకారిణులతో పాటు ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్‌ ప్లేయర్లు కూడా లీగ్‌లో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ జరుగుతుండటంతో ఆ దేశ మహిళలు ఈ టోర్నీకి దూరమయ్యారు. నాలుగు మ్యాచ్‌ల ఈ టోర్నీలో మూడు జట్లు.. డబుల్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్ సూపర్‌ నోవాస్‌, వెలాసిటీ, ట్రయల్‌ బ్లేజర్స్‌ ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. టాప్‌లో నిలిచిన జట్లు వచ్చే సోమవారం (9న) జరిగే తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

16ఏండ్ల అమ్మాయి షెఫాలీ వర్మ, జెమినా రోడ్రిగ్స్‌, మిథాలీపైనే ఎక్కువగా వెలాసిటీ ఆధారపడి ఉంది. ఇక గత సీజన్‌లో హర్మన్‌ రెండు అర్ధ శతకాలతో అదరగొట్టింది. అయితే ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న కౌర్‌.. ఈ లీగ్‌తో మళ్లీ టచ్‌లోకి రావాలనుకుంటోంది. సుదీర్ఘ విరామం తర్వాత ప్లేయర్ల ఫిట్‌నెస్‌, ఆటతీరు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Teams:
Supernovas: Priya Punia, Chamari Athapaththu, Jemimah Rodrigues, Harmanpreet Kaur(c), Shashikala Siriwardene, Taniya Bhatia(w), Pooja Vastrakar, Radha Yadav, Poonam Yadav, Shakera Selman, Ayabonga Khaka.

Velocity: Shafali Verma, Danielle Wyatt, Mithali Raj(c), Veda Krishnamurthy, Sushma Verma(w), Sune Luus, Manali Dakshini, Shikha Pandey, Ekta Bisht, Leigh Kasperek, Jahanara Alam.

Story first published: Wednesday, November 4, 2020, 19:24 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+