Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens T20 Challenge Final: సూపర్‌నోవాస్ విజయం వైపు.. తొలి ట్రోఫీ కోసం వెలాసిటీ చూపు, తుది టీంలు ఇవే

Supernovas vs Velocity Playing 11 in the Womens T20 Challenge Final

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా.. మహిళల టీ20 ఛాలెంజ్ 2022 ఫైనల్‌ సూపర్‌నోవాస్ (SW) వర్సెస్ వెలాసిటీ (TV)మధ్య జరగనుంది. ఇక దీప్తి శర్మ కెప్టెన్సీలోని వెలాసిటీ తమ తొలి టైటిల్‌ను గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీలోని లీడ్‌ సూపర్‌నోవాస్‌ ఈసారి రికార్డు స్థాయిలో మూడో ట్రోఫీని గెలిచి తీరాలని చూస్తోంది. ఇకపోతే సూపర్‌నోవాస్ ఏడు వికెట్ల తేడాతో గత మ్యాచ్‌లో వెలాసిటీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు ట్రైల్‌బ్లేజర్స్‌పై 49పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరుకుంది.

మరోవైపు వెలాసిటీ 16పరుగుల తేడాతో ట్రైల్‌బ్లేజర్స్‌తో తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రైల్ బ్లేజర్స్ జట్టు కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడంతో వెలాసిటీ ఫైనల్ చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ట్రైల్‌బ్లేజర్స్ ఎలిమినేట్ కావడంతో మహిళల టీ20 ఛాలెంజ్ టైటిల్ ఈసారి చేతులు మారనుంది.

ఇక ఫైనల్లో తలపడే ఇరు జట్లు పటిష్ఠమైన ప్లేయర్లను కలిగి ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. సూపర్ నోవాస్ జట్టు.. వెలాసిటీ జట్టుతో పోలిస్తే కాస్త బెటర్ అవకాశాలను కలిగి ఉందని చెప్పవచ్చు. అయితే కిరణ్ నవిగిరే లాంటి హిట్టర్ వెలాసిటీ జట్టులో ఉండడం వల్ల ఆ జట్టుకు కూడా గెలుపు అవకాశాలు లేకపోలేదు.

ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11‌టీంలు
సూపర్‌నోవాస్ :
డియాండ్రా డోటిన్, ప్రియా పునియా, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), తానియా భాటియా (WK), సునే లూస్, పూజా వస్త్రాకర్, సోఫీ ఎక్లెస్టోన్, అలనా కింగ్, మేఘనా సింగ్, మాన్సీ జోషి
వెలాసిటీ :
షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, యాస్తికా భాటియా (wk), KP నవ్‌గిరే, నత్తకాన్ చంతమ్, దీప్తి శర్మ (c), స్నేహ రానా, కేట్ క్రాస్, అయాబొంగా ఖాకా, రాధా యాదవ్, మాయా సోనావానే

Story first published: Saturday, May 28, 2022, 14:05 [IST]
Other articles published on May 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+