For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shreyas Iyer..ఫస్ట్ రియాక్షన్: ఢిల్లీ బ్యాటింగ్ బ్యాక్‌బోన్‌.. ఆ జట్టుకు: లెట్స్ కిల్ ఇట్

 Superb proud and excited to be part of KKR family, Its going to be exciting season: Shreyas Iyer

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ మెగా వేలంపాట బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతోంది. శిఖర్ ధావన్‌తో ఆరంభమైందీ ఈవెంట్. ఈ వేలంపాటలో డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ బోణీ కొట్టాడు. పంజాబ్ కింగ్స్ అతణ్ని కొనుగోలు చేసింది. దీనికోసం 8 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఆ తరువాత పలువురు క్రికెటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నారు. మధ్యలో ఆక్షనీర్ కిందపడిపోవడంతో కొంత కలకలం చెలరేగింది. అతను క్షేమంగానే ఉన్నాడని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కేకేఆర్‌కు

కేకేఆర్‌కు

ఈ వేలం పాట సందర్భంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్.. భారీ రేటుకు అమ్ముడుపోయాడు. కోల్‌కత నైట్ రైడర్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. దీనికోసం 12 కోట్ల 25 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. ఇదివరకు అతను ఢిల్లీ కేపిటల్స్‌లో ఆడాడు. ఆ జట్టు బ్యాటింగ్‌కు బ్యాక్‌బోన్‌గా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించాడు. ఐపీఎల్ టోర్నమెంట్లల్లో అతని ఫెయిల్యూర్స్ పర్సంటేజీ చాలా తక్కువ. గుడ్ ట్రాక్ రికార్డ్‌ను తన పేరు మీద లిఖించుకున్నాడు.

శ్రేయాస్ అయ్యర్ ఫస్ట్ రియాక్షన్..

శ్రేయాస్ అయ్యర్ ఫస్ట్ రియాక్షన్..

వేలంపాటలో తనను కోల్‌కత నైట్ రైడర్స్ సొంతం చేసుకోవడం పట్ల శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. సూపర్బ్ అంటూ రియాక్ట్ అయ్యాడు. గర్వంగా ఉందని వ్యాఖ్యానించాడు. కోల్‌కత నైట్ రైడర్స్ కుటుంబంలో సభ్యుడిగా చేరడం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. కేకేఆర్ ఫ్యామిలీతో కలవడానికి సూపర్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నానని చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్ అద్భుతంగా ఉంటుందని, కేకేఆర్ తరఫున గ్రౌండ్‌లో దిగడానికి ఎగ్జయిటింగ్‌గా ఉందని అన్నాడు.

 లంచ్ బ్రేక్ వరకూ ఒక్కరినీ తీసుకోని ఫ్రాంఛైజీలు..

లంచ్ బ్రేక్ వరకూ ఒక్కరినీ తీసుకోని ఫ్రాంఛైజీలు..

తొలి రౌండ్ బిడ్డింగ్‌లో మధ్యాహ్నం భోజన విరామం వరకు కూడా ఒక్క ప్లేయర్‌ను కూడా కొనుగోలు చేయలేకపోయాయి సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్. ఈ రెండు జట్లు కూడా ప్లేయర్ల కోసం పోటీ పడ్డాయే తప్ప దాన్ని విజయవంతంగా మలచుకోలేకపోయాయి. లంచ్ బ్రేక్ వరకూ ఒక్కరిని కూడా తీసుకోలేకపోయాయి. ఈ వ్యవహారం కాస్తా నెటిజన్లకు ఆగ్రహానికి గురి చేసినట్టయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీని టార్గెట్‌గా చేసుకుని చెలరేగిపోయారు.

హర్షల్ కోసం పోటీ పడినా..

హర్షల్ కోసం పోటీ పడినా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేయడానికి పోటీ పడింది. బెంగళూరుతో ఆసక్తికరంగా పోరు సాగించింది. ఫలితంగా- హర్షల్ పటేల్ ధర 10 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ వేలంపాటలో యంగ్ క్రికెటర్లు భారీ రేటుకు అమ్ముడుపోయారు. పేస్ బౌలర్ హర్షల్ పటేల్ అనూహ్యంగా 10 కోట్ల రూపాయల మార్క్‌ను దాటాడు. 10 కోట్ల 75 లక్షల రూపాయలతో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అతని బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలు మాత్రమే. ఇదివరకు కూడా అతను అదే టీమ్‌లో ఆడాడు. మళ్లీ అదే టీమ్‌లో చేరాడు. 10 కోట్ల రూపాయల మైలురాయిని అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్.

Story first published: Saturday, February 12, 2022, 15:05 [IST]
Other articles published on Feb 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+