Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: బ్యాటింగ్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోని భారత్

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఈ జైత్రయాత్రకు కారణం వరల్డ్ కప్‌ పవర్ ప్లేలో టీమిండియా సింగిల్ వికెట్‌ను కోల్పోకుండా ఉండటమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మార్చి 19 (గురువారం) మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదు చేసిన విజయంతో వరుసగా ఏడు విజయాలను వరల్డ్ కప్‌లో నమోదు చేసి సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇక మార్చి 26న పాకిస్ధాన్ లేదా ఆస్టేలియాతో సెమీ ఫైనల్స్‌లో తలపడనుంది.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం నాడు జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 109 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్‌లో టీమిండియా సాధించిన వరుస విజయాలకు దోహదపడింది మాత్రం పవర్ ప్లేలో అద్భుతమైన బ్యాటింగేనని నిపుణులు అంటున్నారు.

ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో టీమిండియా పవర్ ప్లేలో ఒక్క మ్యాచ్ కూడా నష్టపోలేదు. ఇదొక అధ్భుతమైన స్టాటటిక్. బంగ్లాదేశ్ మ్యాచ్‌పై విజయం సాధించిన అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ బ్యాటింగ్ పవర్ ప్లేలో 5 ఓవర్లలో ఎలాంటి వికెట్లు కోల్పోకుండా 50 పరుగులు చేసిందన్నారు.

ఈ ఐదు ఓవర్లను లాటరీ సిస్టమ్ ద్వారా ఎంచుకోవడం లేదని ధోని వెల్లడించారు. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌‌ల్లో బ్యాటింగ్ పవర్ ప్లేలో 55 నుంచి 60 వరకు పరుగులు సాధించామన్నారు. స్లాగ్ ఓవర్లలో ఎన్ని ఎక్కువ పరుగులు రాబట్టుకుంటే అంత మంచిదన్నారు.

Super start: India have not lost a single wicket in batting powerplays at World Cup

ఐసీసీ వరల్డ్ కప్ 2015లో భారత్ బ్యాటింగ్ పవర్ ప్లేలో భారత గణాంకాలు:

Vs అడిలైడ్‌లో పాకిస్ధాన్‌పై - 25/0 (36-40)

Vs మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికాపై - 44/0 (36-40)

Vs పెర్త్‌లో యూఏఈపై - 16/0 (17-18.5)

Vs పెర్త్‌లో వెస్టిండిస్‌పై - 21/0 (36-39.1)

Vs హామిల్టన్‌లో ఐర్లాండ్‌పై - 32/0 (34-36.5)

Vs ఆక్లాండ్‌లో జింబాబ్వేపై - 39/0 (36-40)

Vs మెల్‌బోర్న్‌లో బంగ్లాదేశ్‌పై- 50/0 (36-40)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+